Free Petrol Credit Card: ఈ మధ్యకాలంలో మనదేశంలో పెట్రోల్ మరియు డీజిల్ ధరలు భారీగా పెరిగిపోయిన సంగతి అందరికీ తెలిసిందే. దీంతో చాలామంది సామాన్య ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో కొన్ని బ్యాంకులు ఆయిల్ మార్కెటింగ్ సంస్థలతో డీల్ కుదుర్చుకొని కొన్ని రకాల క్రెడిట్ కార్డులపై ఆఖరి ఇస్తున్నాయి. మీరు ఈ క్రెడిట్ కార్డులను ఉపయోగించి పెట్రోల్ లేదా డీజిల్ కొనుగోలు చేసినట్లయితే మీకు రివార్డుల రూపంలో కానీ లేదా క్యాష్ బ్యాక్ రూపంలో గానీ ఉచితంగా మీరు పెట్రోల్ లేదా డీజిల్ పొందే అవకాశం మీకు కల్పిస్తున్నారు. ఈ విధంగా మీరు క్రెడిట్ కార్డులను ఉపయోగించి ప్రతినిలా మీకు వచ్చే పెట్రోల్ బిల్లు ఖర్చును తగ్గించుకోవచ్చు.
ప్రస్తుతం మార్కెట్లో కొన్ని రకాల క్రెడిట్ కార్డులపై పెట్రోల్ లో ఉచితంగా పొందే అవకాశం కల్పిస్తున్నారు. ప్రతినెల మీరు క్రెడిట్ కార్డును ఉపయోగించి మీకు వచ్చే పెట్రోల్ బిల్లును తగ్గించుకోవచ్చు. కొన్నిసార్లు మీరు ఉచితంగా పెట్రోల్ కూడా పొందే అవకాశం ఉంది. ఈ మధ్యకాలంలో కొన్ని బ్యాంకులు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలతో కలిసి కొన్ని రకాల క్రెడిట్ కార్డులపై ఫ్యూయల్ ఫ్రీగా అందిస్తున్నాయి. మీరు ఇక క్రెడిట్ కార్డును ఉపయోగించి పెట్రోల్ లేదా డీజిల్ కొనుగోలు చేసినట్లయితే మీకు క్యాష్ బ్యాక్ లేదా రివార్డ్ పాయింట్లు లేదా కొన్నిసార్లు ఉచితంగా పెట్రోల్ పొందవచ్చు. ఈ మధ్యకాలంలో మార్కెట్లో ఎక్కువగా ఫ్యూయల్ క్రెడిట్ కార్డులు అందుబాటులోకి వచ్చాయి. పలు ప్రభుత్వ మరియు ప్రైవేటు సంస్థలు కొన్ని బ్యాంకులతో ఒప్పందం కుదుర్చుకొని ప్రజలకు ఈ సేవలను అందిస్తున్నాయి.
మీరు హెచ్డిఎఫ్సి భారత్ క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డును ఉపయోగించి ఐదు శాతం వరకు ఫ్యూయల్ క్యాష్ బ్యాక్ పొందవచ్చు. అదేవిధంగా ఇక క్రెడిట్ కార్డును ఉపయోగించి మీరు 400 రూపాయల కంటే ఎక్కువగా పెట్రోల్ కొనుగోలు చేసినట్లయితే దానిపై వచ్చే ఒక శాతం సర్ ఛార్జ్ మీకు తగ్గుతుంది. మీరు ఇండియన్ ఆయిల్ యాక్సిస్ బ్యాంకు క్రెడిట్ కార్డు ను ఉపయోగించి 200 రూపాయల నుంచి 5000 రూపాయల వరకు పెట్రోల్ కొనుగోలు చేసినట్లయితే దానిమీద వచ్చేసరి చార్జి పై మీకు ఒక శాతం మినహాయింపు ఉంటుంది. అలాగే మీరు ఎస్బిఐ బీపీసీఎల్ క్రెడిట్ కార్డును ఉపయోగించి పెట్రోల్ కొనుగోలు చేసినట్లయితే 3.25% మీకు రివార్డు లభిస్తుంది.