Todays Gold Rate: ఈరోజు పసిడి ధరలు మళ్లీ పెరిగాయి. చాలామంది కూడా ఆషాడ మాసం పండుగ సీజన్ కావడంతో అలాగే వచ్చే శ్రావణమాసంలో పెళ్లిళ్ల కోసం బంగారం కొనడానికి చాలా కాలం నుంచి ఎదురుచూస్తున్నారు. అయితే గత వారం రోజుల నుంచి తగ్గుతూ వచ్చిన పసిడి ధరలు ఈరోజు మాత్రం మళ్లీ పెరిగాయి. దీంతో బంగారం కొనాలని ఎదురుచూస్తున్న వారికి ఇది ఒక చేదు వార్త అని తెలుస్తుంది. జూన్ నెల ఆఖరిలో బంగారం ధరలు బాగా తగ్గాయి.
కానీ జూలై ఒకటవ తేదీ నుంచి మళ్లీ బంగారం ధరలలో పెరుగుదల కనిపిస్తుంది. ముఖ్యంగా గత వారం రోజుల నుంచి స్వచ్ఛమైన బంగారం 100 గ్రాములకు రూ.34,900 తగ్గడంతో బంగారం కొనుగోలు చేయడానికి భావించేవారు చాలా ఆనందపడ్డారు. జూన్ 23 నుంచి జూన్ 30వ తేదీ వరకు బంగారం ధరలు తగ్గుతూనే ఉన్నాయి. కానీ జూలై 1వ తేదీ నుంచి మాత్రం మళ్లీ ఏకంగా రూ.1,140 పెరిగింది. మన దేశ మార్కెట్లో జూలై 2, బుధవారం రోజున స్వచ్ఛమైన తులం బంగారం ధర రూ.98,410, ఆర్నమెంట్ తులం బంగారం ధర రూ.90,210 గా ఉన్నాయి.
దేశంలో ఉన్న పలు ప్రధాన నగరాలు ముంబై, చెన్నై, బెంగళూరు మరియు కోల్కత్తా నగరాలలో జూలై రెండవ తేదీన స్వచ్ఛమైన తులం గోల్డ్ ధర రూ.98,410, ఆర్నమెంట్ తులం గోల్డ్ ధర రూ.90,210, కిలో వెండి ధర రూ.1,10,100 గా ఉన్నాయి. ఢిల్లీ నగరంలో మాత్రం ఈరోజు స్వచ్ఛమైన తులం గోల్డ్ ధర రూ.98,560, ఆర్నమెంట్ తులం గోల్డ్ ధర రు.90,360, కిలో వెండి ధర రు.1,10,100 గా ఉన్నాయి.
తెలుగు రాష్ట్రాలలో ముఖ్యమైన నగరాలు హైదరాబాద్, విజయవాడ మరియు విశాఖపట్నంలో జులై రెండవ తేదీన స్వచ్ఛమైన తులం గోల్డ్ ధర రూ.98,410, ఆర్నమెంట్ తులం గోల్డ్ ధర రూ.90,210, కిలో వెండి ధర రూ.1,20,100 గా ఉన్నాయి.