Gold Items: బంగారం దొరికితే దేనికి సంకేతం.. శుభమా లేదా అశుభమా.. దొరికితే ఏం చేయాలో తెలుసా..
మన దేశ తెలుగు సంప్రదాయంలో బంగారానికి చాలా ప్రాధాన్యత ఉంది. ముఖ్యంగా ఇది అదృష్టానికి మరియు గౌరవానికి చిహ్నంగా పరిగణిస్తారు. బంగారం లక్ష్మీదేవి అనుగ్రహానికి కూడా ప్రతీక అనే నమ్ముతారు. ముఖ్యంగా పెళ్లిళ్లలో, శుభకార్యాలలో మహిళలు బంగారాన్ని ఎక్కువగా కొనుగోలు చేస్తారు. అయితే చాలామందిలో ఉండే సందేహం ఏమిటంటే రోడ్డుమీద బంగారం దొరికితే అది దేనికి సంకేతం. అలాగే ఒకవేళ బంగారం పోయినా కూడా అది శుభమా లేదా ఆ శుభమా అనే అనుమానాలు కలుగుతాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆ వ్యక్తి యొక్క జాతకంలో కేతువు, శని మరియు రాహువు అనే మూడు గ్రహాల చెడు ప్రభావం వలన బంగారం కోల్పోవడం జరుగుతుంది.
హిందూ మత శాస్త్రం ప్రకారం ఈ మూడు గ్రహాలు కూడా మనిషి జీవితంలో కష్టాలను, ఆరోగ్య సమస్యలను మరియు ఆర్థిక నష్టాలను తెచ్చి పెడతాయి అని నిపుణులు చెబుతుంటారు. కాబట్టి బంగారం పోవడం అంటే ఆ వ్యక్తి దురదృష్టానికి సంకేతం అని భావిస్తారు. కేవలం ఇది బంగారం పోగొట్టుకోవడం మాత్రమే కాదు ఇతర విలువైన వస్తువులను పోగొట్టుకోవడానికి కూడా సంకేతంగా పరిగణిస్తారు. ఈ విధంగా జరిగితే ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు విపత్తులు కూడా ఎదురయ్యే అవకాశం ఉంది. మరి కొంతమంది బంగారం దొరికితే చాలా అదృష్టంగా పరిగణిస్తారు. కానీ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బయట ప్రయాణిస్తున్నప్పుడు లేదా దారిలో నడుస్తున్నప్పుడు బంగారం కనిపించడం అశుభం.
సూర్యుడు మరియు గృహస్పతి గ్రహాల చెడు స్థితిని ఇది సూచిస్తుంది అని చెప్తారు. ఈ రెండు గ్రహాలు చెడు ప్రభావాన్ని కలిగించే అవకాశం ఉంది. ఇలా ఒక వ్యక్తికి బంగారం దొరకడం వలన ఆ వ్యక్తి కీర్తి మరియు ఆత్మవిశ్వాసం తగ్గిపోతుంది అలాగే సమాజంలో హోదా తగ్గిపోతుంది అని నమ్ముతారు. ఆ వ్యక్తి యొక్క ఆరోగ్యం పై కూడా ఇది చెట్టు ప్రభావం చూపించే అవకాశం ఉంది. కాబట్టి రోడ్డు మీద బంగారం దొరికితే అది మంచి పరిణామం కాకపోవచ్చు. దొరికిన బంగారాన్ని సొంతం చేసుకోకూడదు. దొరికిన బంగారాన్ని జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గురువారం రోజున బ్రాహ్మణులకు ఇవ్వడం చాలా ఉత్తమం.