Todays Gold Price: ప్రతి ఒక్కరు కూడా మార్కెట్లో బంగారం లేదా వెండి ఆభరణాలను కొంటున్న సమయంలో వాటి నాణ్యత పై ముఖ్యంగా శ్రద్ధ వహించాలి. బంగారం కొనడానికి ముందు హాల్ మార్క్ తనిఖీ చేయాలి. ఈరోజు మన దేశ మార్కెట్లో బంగారం మరియు వెండి ధరలలో తగ్గుదల కనిపించింది. యూఎస్ డాలర్ అస్థిరత మరియు ఇరాన్, ఇజ్రాయిల్ దేశాల మధ్య ఉద్రిక్తతల కారణంగా బంగారం ధరలలో మార్పులు జరుగుతున్నాయి.
అంతర్జాతీయంగా బంగారం ధరలలో కనిపించిన మార్పులు మన దేశ మార్కెట్లో కూడా ప్రభావం చూపిస్తాయి. దేశవ్యాప్తంగా జూన్ 24, మంగళవారం స్వచ్ఛమైన తులం బంగారం ధర రూ.1,00,680, ఆర్నమెంట్ తులం బంగారం ధర రూ.92,290 గా ఉంది. ఇరాన్, ఇజ్రాయిల్ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధ సమయంలో బంగారం ధరలు అంతగా పెరగలేదు అని తెలుస్తుంది. ఇక మన దేశంలో ఉన్న పలు ముఖ్యమైన నగరాలు ముంబై, కోల్కత్తా, చెన్నై, కేరళ లో ఈరోజు స్వచ్ఛమైన తులం గోల్డ్ ధర రూ.1,00,680, ఆర్నమెంట్ తులం గోల్డ్ ధర రూ.92,290 గా ఉంది.
ఇక ఢిల్లీ నగరంలో మాత్రం ఈరోజు స్వచ్ఛమైన తులం గోల్డ్ ధర రూ.1,00,830, ఆర్నమెంట్ తులం గోల్డ్ ధర రూ.92,440 గా ఉంది.
తెలుగు రాష్ట్రాలలో ఉన్న పలు ప్రధాన నగరాలు హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, ప్రొద్దుటూరు మరియు వరంగల్ లో ఈరోజు స్వచ్ఛమైన తులం గోల్డ్ ధర రూ.1,00,680, ఆర్నమెంట్ తులం గోల్డ్ ధర రూ.92,290 గా ఉంది. ఈరోజు వెండి ధరలో కూడా తగ్గుదల కనిపించింది. దేశంలో ఉన్న అన్ని ప్రధాన నగరాలలో ఈరోజు కిలో వెండి ధర రూ.1,00,990 గా ఉంది.