Todays Gold Rate: ఇరాన్, ఇజ్రాయిల్ దేశాల మధ్య కాల్పుల విరమణ ప్రకటించడంతో బులియన్ మార్కెట్లో బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. ఈ క్రమంలో హైదరాబాద్ నగరంలో కూడా 22 క్యారెట్ల తులం బంగారం ధరపై రూ.850 తగ్గింది. గత వారం రోజుల నుంచి బంగారం ధరలో తగ్గుదల కనిపిస్తూ ఉంది. మన దేశ ప్రజలకు బంగారంతో ఒక మంచి అనుబంధం ఉంది. బంగారాన్ని మన దేశ మహిళలు కేవలం ఒక ఆభరణంగా మాత్రమే కాకుండా సురక్షితమైన ఆర్థిక భరోసాగా కూడా భావిస్తారు. ఈ క్రమంలో చాలామంది పెళ్లిళ్లు, శుభకార్యాల సమయంలో బంగారాన్ని కొనుగోలు చేస్తారు. కష్ట కాలంలో భవిష్యత్తులో ఒక ఆదుకునే ఆస్తిగా బంగారం ఉపయోగపడుతుంది.
గత వారం రోజుల నుంచి బంగారం ధరలు తగ్గుతూ ఉండడంతో పసిడి ప్రియులకు ఊరట కలుగుతుంది. అంతర్జాతీయంగా శాంతి వాతావరణం నెలకొనడంతో మన దేశ మార్కెట్లో కూడా బంగారం ధరలు తగ్గుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా జరిగే రాజకీయ మరియు ఆర్థిక పరిస్థితులు కూడా బంగారం ధరలపై ప్రభావం చూపిస్తాయి అన్న సంగతి తెలిసిందే. డోనాల్డ్ ట్రంప్ రెండు రోజుల క్రితం ఇరాన్ మరియు ఇజ్రాయిల్ దేశాల మధ్య కాల్పుల విరమణ ప్రకటించడంతో ప్రపంచవ్యాప్తంగా శాంతి నెలకొంది.
ఈ క్రమంలో డిమాండ్ తగ్గడంతో మన దేశ మార్కెట్లో బంగారం ధరలు తగ్గుతున్నాయి. తెలుగు రాష్ట్రాలలో ప్రధాన నగరాలు హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, వరంగల్ లో ఈరోజు తులం బంగారం పై రూ.850 తగ్గింది. ప్రస్తుతం ఆర్నమెంట్ తులం బంగారం ధర రూ.89,850 గా ఉంది. అలాగే స్వచ్ఛమైన తులం బంగారం పై ఈరోజు రూ.930 తగ్గింది. ప్రస్తుతం మనదేశ మార్కెట్లో స్వచ్ఛమైన తులం బంగారం ధర రూ.98,020 గా ఉంది. వెండి ధరలు కూడా స్వల్పంగా తగ్గుతున్నాయి. ఈరోజు కిలో వెండి ధరపై వంద రూపాయలు తగ్గింది. ప్రస్తుతం మన దేశం మార్కెట్లో కిలో వెండి ధర రూ.1,17,900 గా ఉంది.