Todays Gold Rate: బంగారం కొనాలని భావిస్తున్న వారికి ఇది చాలా మంచి అవకాశం అని చెప్పొచ్చు. అంతర్జాతీయంగా ఏర్పడిన ఉద్రిక్తతలు ప్రస్తుతం సద్దుమణుగుతున్న సమయంలో అంతర్జాతీయ మార్కెట్లో బంగారం మరియు వెండి ధరలు తగ్గుతున్నాయి. వరుసగా మూడు రోజుల నుంచి బంగారం ధరలో తగ్గుదల కనిపించింది. నిన్న ఒక్కసారిగా భారీగా తగ్గిన బంగారం రేట్లు ఈరోజు కూడా తగ్గాయి.
ఈ మధ్యకాలంలో బంగారం ధరలు పెరుగుతూ ఆల్ టైం రికార్డుకు చేరుకోవడంతో బంగారం కొనాలని భావిస్తున్న వారు బంగారం కొనుగోలు చేయడానికి వాయిదా వేసుకున్నారు. అయితే అటువంటి వారి కోసం ఇప్పుడు ఒక మంచి శుభవార్త అని చెప్పొచ్చు. గత మూడు రోజుల నుంచి బంగారం ధరలు తగ్గుతున్నా.ఇరాన్, ఇజ్రాయిల్ కాల్పుల విరమణ అలాగే ప్రపంచ మార్కెట్లలో బలహీన డిమాండ్ వంటి అనేక అంశాల కారణంగా బంగారం ధరలు తగ్గుతున్నాయి.
ఈరోజు జూన్ 26 బంగారం మరియు వెండి ధరలు ఈ విధంగా ఉన్నాయి. అంతర్జాతీయంగా బంగారం ధరలు తగ్గడంతో వాటి ప్రభావం మన దేశ మార్కెట్లో కూడా కనిపిస్తుంది. ప్రస్తుతం హైదరాబాదు నగరంలో నిన్న తులం బంగారంపై రూ.1470 తగ్గింది. అలాగే ఈరోజు కూడా తులం బంగారం పై రూ.270 తగ్గినట్లు సమాచారం. దీంతో ప్రస్తుతం స్వచ్ఛమైన తులం గోల్డ్ ధర రూ.98,950, 22 క్యారెట్ల తులం గోల్డ్ ధర రూ.90,700 గా ఉంది. వెండి ధర కూడా ఈరోజు వెయ్యి రూపాయలు తగ్గింది. ప్రస్తుతం మన దేశ మార్కెట్లో ఈరోజు కిలో వెండి ధర రూ.1,18,000 గా ఉంది.