Gold Theft: మాయమాటలు చెప్పి బంగారం అపహరణ
రాజన్న సిరిసిల్ల జిల్లా/ వీర్నపల్లి, జులై 03 (ప్రజా శంఖారావం): ఓ గుర్తు తెలియని వ్యక్తి మహిళకు మాయమాటలు చెప్పి బంగారం (Gold) దొంగిలించిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం అడవి పదిర గ్రామంలో శుక్రవారం (Friday) చోటుచేసుకుంది. వీర్నపల్లి ఎస్సై లక్ష్మణ్ (SI Laxman) తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. అడవి పదిర గ్రామానికి చెందిన చింతల్ టానా లక్ష్మి (Lakshmi) ఇంట్లో ఉన్న సమయంలో గుర్తుతెలియని ఒక వ్యక్తి (An Unknown Person) ఆమెను పిలిచాడు. బయటికి వచ్చిన లక్ష్మితో ఆ వ్యక్తి మాట్లాడుతూ నీ కుమారునికి ప్రాణగండం ఉందని, అతను బ్రతడానికి తన వద్ద ఒక ఉపాయం ఉందని నమ్మబలికించాడు.
తను చెప్పినట్లు చేయాలని సూచించాడు. ఇంట్లో నుంచి బియ్యం తీసుకొచ్చి ఇస్తే మంచిగా చేస్తానని చెప్పాడు. నమ్మిన లక్ష్మి కొన్ని బియ్యాన్ని తీసుకొచ్చి ఆ వ్యక్తి చేతిలో పెట్టింది. అనంతరం ఆ మహిళకు ఏదో రసాయనంతో కూడుకున్న బొట్టును ఆమె నుదటన పెట్టడంతో మహిళా మైకం కోల్పోయి, ఆ వ్యక్తి ఏలా చెప్తే అలా చేశానని, పక్కనే ఉన్న తన కూతురు పావుతులం బంగారాన్ని ఆ బియ్యంలో వేసి ఉంచమన్నాడని తెలిపింది. అనంతరం గంట తర్వాత (After One hour) ఆ బియ్యాన్ని తీసి చూడమని అక్కడ నుండి ఆ వ్యక్తి వెళ్లిపోయినట్లు వివరించింది.
కొద్దిసేపు అయినా తర్వాత అనుమానం వచ్చిన లక్ష్మి ఆ బియ్యంలో పావు తులం బంగారం వెతకగా దొరకకపోవడంతో పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటన స్థలానికి చేరుకొని బాధితురాలి ఫిర్యాదు (Complaint) మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.