Today Gold Rate: అంతర్జాతీయంగా వాణిజ్య సుంకాల గడువు ముగుస్తున్న సమయంలో అంతర్జాతీయంగా కూడా వాణిజ్య ఒప్పందాలపై ఒక అనేస్థితి పరిస్థితి నెలకొంది. దీంతో పసిడి ధరలపై ఒత్తిడి పెరిగిందని ఎల్కేపీ సెక్యూరిటీస్ నిపుణుడు జతిన్ త్రివేది చెప్పుకొచ్చారు. కొన్ని రోజుల నుంచి పెరుగుతున్న బంగారం వెండి ధరలు మళ్ళీ క్రమంగా తగ్గుతున్నాయి. లక్ష రూపాయలైనా దాటిన తులం గోల్డ్ ధర ప్రస్తుతం 98 వేలకు దిగువన కొనసాగుతుంది.
జులై 8, మంగళవారం రోజు స్వచ్ఛమైన తులం గోల్డ్ ధర మన దేశం మార్కెట్లో రూ.98,280, ఆర్నమెంట్ తులం గోల్డ్ ధర రూ.90,090 గా ఉంది. మన దేశ సంప్రదాయంలో పసిడికి ఒక గొప్ప స్థానం ఇవ్వబడింది. ప్రతి పండుగలు, శుభకార్యాలకు చాలామంది పసిడిని కొనుగోలు చేస్తారు. అయితే గత కొన్ని రోజుల నుంచి భారీగా పెరిగిన బంగారం ధరలు మళ్ళీ తగ్గుముఖం పట్టాయి. ఈరోజు ఏకంగా తులం పసిడి పై 400 రూపాయలు తగ్గింది.
అలాగే మన దేశ మార్కెట్లో ఈరోజు కిలో వెండి రూ.1,09,900 గా ఉంది. దేశంలో ఉన్న పలు ముఖ్యనగరాలు చెన్నై, ముంబై, కోల్కత్తా మరియు బెంగళూరులో మంగళవారం రోజు స్వచ్ఛమైన తులం గోల్డ్ ధర రూ.98,280, ఆర్నమెంట్ తులం గోల్డ్ ధర రు.90,090 గా ఉన్నాయి. తెలుగు రాష్ట్రాలలో పలు ముఖ్య నగరాలు హైదరాబాద్, విజయవాడ మరియు విశాఖపట్నంలో మంగళవారం రోజు తులం గోల్డ్ ధర రూ.98,280, ఆర్నమెంటు తులం గోల్డ్ ధర రూ.90,090 గా ఉన్నాయి.