Todays Horoscope: నేడు ఏప్రిల్ 23, 2025 మేషరాశి వారు ఉద్యోగంలో మీ పనితీరుకు ఆశించిన గుర్తింపు పొందుతారు. వృషభ రాశి వారి ఆదాయం బాగా పెరుగుతుంది. ఈరోజు 12 రాశుల దిన ఫలాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
మేషరాశి: ఉద్యోగంలో మీ పనితీరుతో అధికారులు సంతృప్తి పొందుతారు. మీ తోటి వారికి సహకారాలు అందిస్తారు. డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్ల వంటి వృత్తిరంగంలో ఉన్నవారికి తీరిక ఉండదు. వ్యాపారంలో ఊహించిన లాభాలు పొందుతారు. ఆదాయం పెరుగుతుంది. ఏ పని చేసిన విజయం సాధిస్తారు. వ్యక్తిగత సమస్య పరిష్కారం అవుతుంది. ప్రముఖులత పరిచయాలు ఏర్పడే అవకాశం ఉంది. నిరుద్యోగులు మంచి ఆఫర్లు పొందుతారు.
వృషభ రాశి: వృత్తి మరియు ఉద్యోగంలో గుర్తింపు ఉంటుంది. వ్యాపారంలో సంపాదన నిలకడగా సాగిపోతుంది. ఆదాయం పెరుగుతుంది. ఆదాయం వృద్ధి చేయడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తే అంత మంచిది. ఉద్యోగం మారడానికి ఇది సరైన సమయం. ఉద్యోగ మరియు పెళ్లి ప్రయత్నాలలో శుభవార్తలు వింటారు. వ్యక్తిగత సమస్య పరిష్కారం అవుతుంది. అనుకున్న సమయంలో ముఖ్యమైన పనులను పూర్తి చేస్తారు.
మిథున రాశి: ఉద్యోగంలో ప్రాధాన్యత ఉంటుంది. పదోన్నతి లభిస్తుంది. వృత్తి మరియు వ్యాపారంలో లాభాలు పొందుతారు. లావాదేవీలు పెరిగే అవకాశం ఉంది. ఆదాయంలో ఆశించిన స్థాయిలో పెరుగుదల ఉంటుంది. అనవసర ఖర్చులను తగ్గించుకోవాలి. ఆర్థిక విషయాలలో ఎవరికి వాగ్దానాలు చేయకూడదు. కుటుంబ జీవితం హ్యాపీగా ఉంటుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
కర్కాటక రాశి: ఉద్యోగ జీవితం సంతృప్తికరంగా ఉంటుంది. ఇంట బయట ఒత్తిడి పెరుగుతుంది. బంధువులతో జాగ్రత్త వహించాలి. వృత్తి మరియు వ్యాపారంలో లాభాలు ఉంటాయి. సొంత పనుల మీద శ్రద్ధ పెట్టాలి. ఆర్థిక వ్యవహారాలకు అనుకూలంగా ఉంది. ఆర్థికపరంగా ఎవరికి వాగ్దానాలు చేయకూడదు. ఆరోగ్యం బాగుంటుంది. ఉద్యోగ మరియు పెళ్లి ప్రయత్నాలకు ఇది అనుకూల సమయం.
సింహరాశి: ఉద్యోగ జీవితం సాఫీగా సాగుతుంది. శుభవార్తలు వింటారు. వృత్తి మరియు వ్యాపారంలో పురోగతి ఉంటుంది. విద్యార్థులకు సమయమనుకూలంగా ఉంది. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆదాయం మెరుగుపడుతుంది. కుటుంబంలో మంచి వాతావరణం ఉంటుంది. కుటుంబం మీద ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. స్వల్ప అనారోగ్య సూచనలు ఉన్నాయి.
తులారాశి: ఉద్యోగ జీవితం ప్రోత్సాహకరంగా ఉంటుంది. వృత్తి మరియు వ్యాపారంలో రాబడి పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. ఉద్యోగం మారడానికి ఇది సరైన సమయం. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు వస్తాయి. పెళ్లి ప్రయత్నాలు సఫలం అయ్యే అవకాశం ఉంది. బాగా పలుకుబడి ఉన్న వ్యక్తులతో పరిచయాలు ఏర్పడే అవకాశం ఉంది. ఆదాయం మరియు ఆరోగ్యం బాగానే ఉంటాయి.
తులారాశి: వృత్తి మరియు ఉద్యోగంలో అనుకూల మార్పులు ఉంటాయి. వృత్తి జీవితంలో తీరిక ఉండదు. వ్యాపారం సంతృప్తికరంగా సాగిపోతుంది. ఆదాయం బాగా పెరుగుతుంది. ఏ పని చేసిన విజయం సాధిస్తారు. విదేశాలలో ఉన్న పిల్లల దగ్గర నుంచి శుభవార్తలు వినే అవకాశం ఉంది. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు వస్తాయి. ఎవరిని గుడ్డిగా నమ్మకపోవడం మంచిది.
వృశ్చిక రాశి: ఉద్యోగంలో మీ పనితీరుతో అధికారులను ఆకట్టుకుంటారు. అదనపు బాధ్యతలు ఏర్పడతాయి. వృత్తి మరియు వ్యాపారంలో శ్రమ ఎక్కువగా ఉంటుంది. వ్యక్తిగత పనుల వలన తీరిక ఉండదు. ఆర్థిక లావాదేవీల వలన ప్రయోజనం కలుగుతుంది. అనుకోకుండా ఆదాయం బాగా పెరుగుతుంది. ఆర్థిక సమస్యలు తగ్గుతాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది. మంచి పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది.
ధనస్సు రాశి: ఉద్యోగంలో శుభవార్తలు వింటారు. వ్యాపారంలో శుభ పరిణామాలు జరుగుతాయి. వృత్తి జీవితంలో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఏ పని చేసిన విజయం సాధిస్తారు. కుటుంబ జీవితం సాఫీగా సాగుతుంది. ఆకస్మిక ధన లాభం కలిగే సూచనలు ఉన్నాయి. సొంత పనుల మీద శ్రద్ధ పెట్టాలి. ఆరోగ్యం బాగుంటుంది. మీరు అనుకున్న పెళ్లి సంబంధం కుదురుతుంది.
మకర రాశి: ఉదయంలో పని భారం పెరుగుతుంది. సహ ఉద్యోగుల బాధ్యతలను పంచుకుంటారు. వృతి జీవితంలో గుర్తింపు ఉంటుంది. వ్యాపారంలో రాబడి పెరుగుతుంది. ఆదాయం నిలకడగా సాగిపోతుంది. అనవసర ఖర్చులను తగ్గించుకోవాలి. కొద్దిగా ప్రయత్నించి ముఖ్యమైన పనులను పూర్తి చేస్తారు. ఎప్పటినుంచి ఎదురు చేస్తున్న శుభవార్తలు వింటారు. ఆరోగ్యం బాగుంటుంది.
కుంభరాశి: ఉద్యోగంలో అనుకూలంగా ఉంది. అధికారుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. వృత్తి మరియు వ్యాపారంలో లాభాలు పొందుతారు. ఆదాయం బాగుంటుంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా సాగిపోతుంది. కుటుంబ సభ్యుల మీద ఖర్చులు పెరుగుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగం వస్తుంది.
మీనరాశి: ఉద్యోగంలో బాధ్యతలు పెరుగుతాయి. వృత్తి మరియు వ్యాపారం నిలకడగా ముందుకు సాగుతాయి. ఆర్థిక పనులన్నీ పూర్తవుతాయి. ఇంట బయట ఒత్తిడి ఉంటుంది. ఆరోగ్యం బాగుంటుంది. రాదు అనుకున్న డబ్బు మీ చేతికి వస్తుంది. మిత్రుల వలన ధన నష్టం జరుగుతుంది. ఎక్కువ పనులను మీద వేసుకొని ఇబ్బంది పడతారు.