TG Govt: ఉద్యోగులకు, పెన్షనర్లకు శుభవార్త.. 180 కోట్ల పాత బకాయిలు విడుదల చేసిన ప్రభుత్వం

TG Govt
TG Govt

TG Govt: తాజాగా ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ప్రభుత్వం ఒక మంచి శుభవార్త తెలిపింది. ఉద్యోగులకు, పెన్షనర్లకు సంబంధించి ఎప్పటినుంచో పెండింగ్లో ఉన్న బకాయిలను ప్రభుత్వం తాజాగా విడుదల చేసింది. గత ప్రభుత్వం పాలనలో ఉన్న సమయం నుంచి ఉన్న బకాయిలన్నిటిని ప్రభుత్వం క్లియర్ చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క తెలంగాణ రాష్ట్రంలో బోనాలు పండుగ సందర్భంగా ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ప్రభుత్వం ఈ శుభవార్త తెలిపినట్లు ప్రకటించారు. దీంతో ఎప్పటి నుంచో వేచి చూస్తున్నా ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు భారీ ఊరట లభించింది.

తాజాగా ప్రభుత్వం చాలా కాలం నుంచి పెండింగ్లో ఉన్న ఉద్యోగుల మరియు పెన్షన్ వల్ల బకాయిలను విడుదల చేస్తూ అధికారులకు ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకు పెండింగ్లో ఉన్న రూ. 180.30 కోట్ల మెడికల్ బకాయిలను ప్రభుత్వం క్లియర్ చేస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 26,519 ఉద్యోగులకు అలాగే పెన్షనర్లకు ఊరట లభించింది. గత ప్రభుత్వ హయాంలో ఉన్న పెండింగ్ బిల్లులను కూడా ప్రభుత్వం క్లియర్ చేసినట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయంటూ తెలిపారు.

అయినప్పటికీ కూడా ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని భారీ ఎత్తున సంక్షేమ పథకాలను ప్రభుత్వం అమలు చేస్తున్నట్లు ఆయన వివరించారు. రాష్ట్రంలో ఆర్థిక సమస్యలు ప్రభుత్వం ఎదుర్కొంటూనే మరోపక్క ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు పథకాలను అమలు చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్లు తెలిపారు. అలాగే ప్రభుత్వం ఉద్యోగులకు ఇచ్చిన మాట ప్రకారం బిల్లుల చెల్లింపు దిశగా ప్రస్తుతం నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. తెలంగాణ రాష్ట్రంలో ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులకు మొదటి ప్రాధాన్యత ఇస్తూ ప్రభుత్వం తాజాగా ఈ బకాయి నిధులను విడుదల చేసినట్లు తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group Join Now