Todays Gold Rate: అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు తగ్గడం వలన మన దేశ మార్కెట్లో కూడా తగ్గుతున్నాయి. గత రెండు అంతర్జాతీయ మార్కెట్లో పరిస్థితులు చక్కబడడం అలాగే చేసేవారి ఆసక్తి స్టాక్ మార్కెట్ల వైపు ఉండడం వంటి అనేక కారణాల వలన బంగారం ధరలు తగ్గుతున్నాయి. జులై 5వ తేదీ శనివారం రోజున బంగారం ధరలో భారీగా తగ్గుదల కనిపించింది. దేశవ్యాప్తంగా ఈరోజు బంగారం ధరలు తగ్గాయి. బంగారం కొనడానికి ఇది చాలా మంచి సమయం అని చెప్పొచ్చు.
నిన్నటితో పోలిస్తే ఈరోజు బంగారం ధరలు బాగానే తగ్గాయి. గత కొన్ని రోజుల క్రితం తులం బంగారం ధర లక్ష రూపాయలు దాటిన సంగతి అందరికీ తెలిసిందే. అంతర్జాతీయంగా ఉన్న పరిణామాల కారణంగా మన దేశ మార్కెట్లో కూడా బంగారం ధరలు తగ్గుతున్నాయి. జులై 5 శనివారం రోజున దేశంలో ఉన్న పలు ముఖ్యమైన నగరాలు ముంబై, చెన్నై, బెంగళూరు, కోల్కత్తా లో స్వచ్ఛమైన తులం గోల్డ్ ధర రూ.98,720, ఆర్నమెంట్ తులం గోల్డ్ ధర రూ.90,490, కిలో వెండి ధర రు.1,09,900 గా ఉన్నాయి.
ఇక ఢిల్లీ నగరంలో జూలై ఐదవ తేదీన స్వచ్ఛమైన తులం గోల్డ్ ధర రూ.98,870, ఆర్నమెంట్ తులం గోల్డ్ ధర రూ.90,640, కిలో వెండి ధర రు.1,09,900 గా ఉన్నాయి. ఇక జూలై 5వ తేదీ శనివారం రోజున తెలుగు రాష్ట్రాలలో పలు ముఖ్య నగరాలు హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, రాజమండ్రి, వరంగల్ మరియు ప్రొద్దుటూరులో స్వచ్ఛమైన తులం గోల్డ్ ధర రూ.98,720, ఆర్నమెంట్ తులం గోల్డ్ ధర రు.90,490, కిలో వెండి ధర రూ.1,19,900 గా ఉన్నాయి.