Edible Oil Prices: తాజాగా ట్రంప్ టారిఫ్ వారు వలన భారతదేశానికి ఒక విధంగా ప్రయోజనం కలగనుంది. ఈ క్రమంలో వంట నూనె ధరలు తగ్గబోతున్నాయి. ఇటీవలే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దెబ్బకు ప్రపంచ దేశాలు అన్ని కూడా వణికిపోతున్న సంగతి తెలిసిందే. ప్రపంచ దేశాలు అన్నీ కూడా ప్రస్తుతం టారిఫ్ యుద్ధాన్ని ఎదుర్కొంటున్నాయి. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తనకి ఇష్టం వచ్చినట్లు సింహాలు విధిస్తున్నారు. దీంతో ప్రపంచ దేశాలు అన్నీ కూడా భయపడిపోతున్నాయి.
అయితే అమెరికా అధ్యక్షుడు ట్రంపుటారీఫ్ యుద్ధం వలన భారతదేశానికి ఒక ప్రయోజనం కూడా కలగబోతుంది. వంట నూనె ధరలు తగ్గుతున్నాయి. దీంతో చాలామంది సామాన్యులకు ఊరట లభిస్తుంది. ప్రపంచ దేశాలన్నిటిపై అమెరికా అధ్యక్షుడు టారిఫ్ సుంకాల విధింపు తర్వాత మనదేశంలో పామ్ ఆయిల్ దిగుమతి రేటు తగ్గుతుంది. అలాగే క్రూడ్ మరియు రిఫైండ్ పామాయిల్ రేటు దాదాపుగా ఏడు నుంచి 8% వరకు దిగి వచ్చింది. అలాగే మన దేశం దిగుమతి చేసుకునే ఎడిబుల్ ఆయిల్ లో అధిక వాటా ఆక్రమించే క్రూడ్ సోయాబీన్ ఆయిల్ ధర కూడా తన్నుకు దాదాపు 48 డాలర్ల వరకు తగ్గనుంది.
ఈ ధరలు ఏప్రిల్ 11 నుంచి ఏప్రిల్ 21 మధ్యకాలంలో దిగి వచ్చాయి. దీంతో రానున్న రోజులలో రిటైల్ మార్కెట్లో కూడా వీటి ధరలు తగ్గవచ్చు అని మార్కెట్ నిపుణులు చెప్తున్నారు. ఇదే కనుక నిజమైతే సామాన్యులకు ఊరట లభిస్తుంది. గత రెండు దశాబ్దాలలో మనదేశంలో వంటనూనెల వినియోగం మూడు రెట్ల వరకు పెరిగింది. దీంతో దేశ దిగుమతులపై ఆధారపడడం పెరిగి అలాగే ఉపగాయం వ్యాధులకు సంబంధించిన అనారోగ్య సమస్యలు కూడా తీవ్రమయ్యాయని ఇటీవలే ఒక నివేదిక తెలిపింది. గతంలో వంటనూనె వినియోగం 2001లో కేవలం 8.2 కిలోలుగా ఉండేది. ప్రస్తుతం అది 23.5 కిలోలకు పెరిగిందని నిపుణులు చెప్తున్నారు. అయితే ఇది ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ సిఫార్సు చేసిన 12 కిలోల పరిమితి కంటే రెట్టింపుగా ఉందని చెప్తున్నారు.