UPI transactions: UPI యూజర్లకు కేంద్రం గుడ్ న్యూస్.. ఇకపై యూపీఐ చెల్లింపులపై ఆ చార్జీలు ఉండవు

UPI transactions
UPI transactions

UPI transactions: ఈ మధ్యకాలంలో మనదేశంలో ప్రతి ఒక్కరు కూడా డిజిటల్ చెల్లింపులు చేస్తున్నారు. టీ షాప్ ల దగ్గర నుంచి పెద్ద పెద్ద రెస్టారెంట్లలో, షాపింగ్ మాల్స్ లో, సినిమా థియేటర్లలో ఇలా అన్ని చోట్ల కూడా డిజిటల్ లావాదేవీలు చేస్తున్నారు. డిజిటల్ లావాదేవీలతో చిల్లర సమస్య ఉండదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా డిజిటల్ లావాదేవీలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ మధ్యకాలంలో స్మార్ట్ ఫోన్ వినియోగం కూడా పెరిగిన నేపథ్యంలో డిజిటల్ చెల్లింపులు కూడా గణనీయంగా పెరిగాయి. స్మార్ట్ ఫోన్లో ప్రతి ఒక్కరు యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ యాప్ ద్వారా డిజిటల్ చెల్లింపులు చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో వ్యాపారుల నుంచి ఈ చెల్లింపులపై చార్జులు వసూలు చేస్తారని కొన్ని వార్తలు వినిపించాయి.

తాజాగా వీటిని ప్రభుత్వం కొట్టి పరేసింది. వ్యాపారుల దగ్గర వస్తువులను కొనే సమయంలో చాలామంది క్రెడిట్ కార్డులను ఉపయోగిస్తారు. ఈ క్రమంలో వ్యాపారులు ప్రభుత్వానికి రెండు లేదా మూడు శాతం మర్చంట్ డిస్కౌంట్ రేటు చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు వంద రూపాయల ఏదైనా వస్తువును కొనుగోలు చేసినట్లయితే ఆ వ్యాపారులు ప్రభుత్వానికి రెండు లేదా మూడు రూపాయలు ఎండిఆర్ చెల్లించాల్సి ఉంటుంది. కొనుగోలుదారుల నుంచి కొంతమంది వ్యాపారులు ఎండిఆర్ మొత్తాన్ని కూడా వసూలు చేస్తారు. కానీ యూపీఐ ద్వారా లావాదేవీలు చేస్తున్న సమయంలో ఎండిఆర్ ఉండదు.

ఈ మధ్యకాలంలో యూపీఐ ద్వారా కూడా ఎక్కువ మొత్తంలో లావాదేవీ చేసిన సమయంలో ఎం డి ఆర్ విధిస్తారు అనే వార్తలు కూడా బాగా వినిపించాయి. కానీ ప్రభుత్వానికి ఇప్పట్లో ఇలాంటి ఆలోచన లేదు అని తెలుస్తుంది. మన దేశవ్యాప్తంగా ప్రభుత్వం డిజిటల్ చెల్లింపులకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. కానీ గతంలో నిర్దిష్ట పరిమితికి మించి డిజిటల్ చెల్లింపులపై ఎండిఆర్ వసూలు చేయాలి అనే విషయంపై చర్చలు జరిగిన విషయం వాస్తవమే అని చెప్పాలి. కానీ ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం ఆ విషయంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అలాగే గతంలో క్రెడిట్ కార్డులపై ప్రస్తుతం అమలు చేస్తున్న ఎండిఆర్ ను యూపీఐ చెల్లింపులతోపాటు రూపే కార్డుకు వర్తింపజేయాలి అన్న వార్తలు కూడా వినిపించాయి.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group Join Now