Free Gas Cylinder: ప్రతి ఒక్కరూ తమ ఇంట్లో గ్యాస్ సిలిండర్ ఉపయోగిస్తారు. ఎల్పిజి గ్యాస్ సిలిండర్ నిత్యజీవితంలో సాధారణం అయిపోయింది. ఒకప్పటి కాలంలో ప్రజలు ఎక్కువగా కట్టెల పొయ్యి మీద వంట చేసేవారు. కానీ ఈ ఆధునిక యుగంలో కట్టెల పొయ్యి ఎక్కడ కనిపించడం లేదు. పూరి గుడిసెల దగ్గర నుంచి పెద్ద పెద్ద భవనాల వరకు ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఎల్పిజి గ్యాస్ సిలిండర్ మీదనే వంట చేస్తారు. ఈ క్రమంలోనే రోజురోజుకు సిలిండర్ల ధరలు కూడా పెరుగుతూ ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలు పేద ప్రజలకు సబ్సిడీ మీద సిలిండర్లను అందిస్తున్నాయి.
ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో 500 రూపాయలకు ఎల్పిజి సిలిండర్ ప్రభుత్వం అందిస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉచితంగా సిలిండర్ లభిస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ విధానంలో కొన్ని మార్పులు చేయాలని ఆలోచనలో ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు ఉన్న లబ్ధిదారులకు ఒక ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు లభిస్తాయి. అంటే రేషన్ కార్డు కలిగిన వాళ్లు ప్రతి నాలుగు నెలలకు ఒక
ఉచిత గ్యాస్ సిలిండర్ తీసుకోవచ్చు. అక్టోబర్ 31 నుంచి మార్చి 31 వరకు తొలి గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకోవాలి. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఏప్రిల్ 1 నుంచి జూలై 31 వరకు రెండవ గ్యాస్ సిలిండర్ ని బుక్ చేసుకోవచ్చు. జులై 1 నుంచి నవంబర్ 30 వరకు ఏపీ రాష్ట్ర ప్రజలు మూడవ గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకోవచ్చు. ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ విధానం అమలులో ఉంది. అయితే ఇకపై ఏపీ ప్రభుత్వం ఉచిత గ్యాస్ సిలిండర్ పథకంలో కొత్త విధానాన్ని తీసుకురావాలని భావిస్తుంది. ఈ పథకంలో ఉన్న లబ్ధిదారులకు దీపం పథకం కింద ముందుగానే డబ్బులు చెల్లించాలని ప్రభుత్వం భావిస్తుంది. ఇది కూడా ప్రభుత్వం తీసుకున్న చాలా మంచి నిర్ణయం అని తెలుస్తుంది. తాజాగా నిర్వహించిన టిడిపి పొలిట్ బ్యూరో సమావేశంలో దీపం పథకం గురించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.