Todays Gold Rate: మహిళలకు షాకింగ్ న్యూస్…పెరిగిన పసిడి ధరలు…ఈరోజు తులం ఎంత అంటే…
గతంలో భారీగా పెరిగిన బంగారం ధరలు కొన్ని రోజుల నుంచి తగ్గుతూ వస్తున్నాయి. నెల క్రితం లక్ష రూపాయల రికార్డుకు చేరుకున్న 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర ప్రస్తుతం ఏకంగా 95 వేలకు పడిపోయిందని తెలుస్తుంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 87 వేల దగ్గర ఉంది. బంగారం ధరలు గత కొన్ని రోజుల నుంచి తగ్గుతూ ఉండడంతో ఇంట్లో శుభకార్యాలకు బంగారం కొనుగోలు చేయాలని భావిస్తున్న వారు బంగారం దుకాణాలకు పరుగులు పెడుతున్నారు. మరి కొంతమంది బంగారం ధరలు ఇంకా తగ్గితే తీసుకుందామని వెయిట్ చేస్తున్నారు. ఈరోజు బంగారం కొనుగోలు చేయాలని భావిస్తున్న వారికి ఇది షాకింగ్ న్యూస్. బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. రానున్న రోజులలో కూడా ఈ ధరలో మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలో ఉన్న పలు ప్రధాన నగరాలలో ఈరోజు ధరలు ఈ విధంగా ఉన్నాయి.
నిన్న శుక్రవారం రోజు హైదరాబాద్ నగరంలో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం రేట్ రూ. 95,130, అయితే ఈరోజు పది రూపాయలు పెరిగి రూ.95,140 గా ఉంది. ఇక ఈరోజు 22 క్యారెట్ల తులం బంగారం రేటు రూ. 87,210 గా ఉంది. ఇక ఇతర తెలుగు రాష్ట్రాలలో ప్రధాన నగరాలు అయినా రాజమండ్రి, పొద్దుటూరు, విజయవాడ, విశాఖపట్నం, నిజామాబాద్, వరంగల్ నగరాలలో కూడా దాదాపు ఇవే ధరలు ఉన్నాయని సమాచారం. దేశ రాజధాని అయిన ఢిల్లీ నగరంలో నేడు 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ రూ. 87,360, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ ఈరోజు రూ. 95,290. ఇతర ప్రధాన నగరాలు ముంబై, చెన్నై, కోల్కత్తా, బెంగళూరు మరియు కేరళ వంటి నగరాలలో కూడా ఈరోజు 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ రూ. 87,210, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ ఈరోజు రూ. 95,140. మన దేశ మార్కెట్లో బంగారం తర్వాత ప్రజలు ఎక్కువగా కొనుగోలు చేసే లోహం వెండి. గత కొన్ని రోజుల నుంచి వెండి ధరలు మార్కెట్లో క్రమంగా తగ్గుతున్నాయి. ఇక ఈరోజు కూడా కిలో వెండి పై వంద రూపాయలు తగ్గి రూ.1,07,900.