Todys Gold Rate: బంగారం కొనాలని భావిస్తున్న వారికి ఒక మంచి శుభవార్త. ఈరోజు మన దేశం మార్కెట్లో బంగారం ధరలు తగ్గినట్లు తెలుస్తుంది. మన దేశ మార్కెట్లో బంగారానికి ఒక ప్రత్యేక డిమాండ్ ఉంది. మన మహిళలు ఎక్కువగా కొనడానికి ఆసక్తి చూపించే వస్తువులలో బంగారం ఎప్పుడూ ముందుంటుంది. కానీ గత కొన్ని నెలల నుంచి బంగారం ధరలు పెరుగుతూ అందరికీ షాక్ ఇచ్చాయి.
గత మూడు నాలుగు రోజుల నుంచి పెరిగిన బంగారం ధరలలో ఈరోజు స్వల్పంగా తగ్గుదల కనిపించింది. ప్రస్తుతం బంగారం ధరలు తులం 1 లక్ష దాటిన విషయం అందరికీ తెలిసిందే. జూన్ 21, 2025 శనివారం రోజున మన దేశ మార్కెట్లో స్వచ్ఛమైన తులం గోల్డ్ ధర రూ.1,00,470, ఆర్నమెంట్ తులం గోల్డ్ ధర రూ.92,090 గా ఉన్నాయి.
నిన్నటితో పోలిస్తే ఈరోజు తులం బంగారంపై పది రూపాయలు ధర తగ్గింది. దేశంలో ఉన్న అన్ని ప్రధాన నగరాలు ముంబై, కోల్కత్తా, చెన్నై, కేరళ ఇక తెలుగు రాష్ట్రాలలో నగరాలు హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం మరియు వరంగల్ వంటి నగరాలలో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి. అన్ని నగరాలలో ఈరోజు కిలో వెండి ధర రూ.1,20,000 గా ఉందని సమాచారం.