High Profit Farming: రైతులు శీతాకాలంలో వరి, మిర్చి, పత్తి పంటలను పండిస్తారు. ఆ తర్వాత మార్చి నెలలో పొలాలు ఖాళీగా ఉంటాయి. ఈ పరిస్థితి దాదాపు ప్రతి చోటా ఉంటుంది. మన రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా ఇదే పరిస్థితి ఉంటుంది. అయితే మార్చి నెలలో పొలాలు ఖాళీగా ఉన్న సమయంలో రైతులు కొత్తిమీర ఆకులను పండిస్తే తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాన్ని పొందగలుగుతారు. అయితే సాధారణంగా వేడి రోజుల్లో మంచి కొత్తిమీర ఆకులు ఏ మార్కెట్లో కూడా కనిపించవు. కానీ మంచి కొత్తిమీర ఆకులకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది.
ఈ క్రమంలో రైతులు ఖాళీ పొలాల్లో కొత్తిమీరను పంపిస్తే వాళ్లు మంచి లాభాలను అర్జించగలుగుతారు. వ్యవసాయ విజ్ఞాన కేంద్రంలో పనిచేస్తున్న వ్యవసాయ నిపుణుడు డాక్టర్ ఎంసీ త్రిపాఠి కొత్తిమీర సాగు చేయడానికి మార్చి నుంచి ఏప్రిల్ నెలలు చాలా అనువైనవి అంటూ తెలిపారు. అయితే మార్చి నెలలో రైతులు భూమిని బాగా దున్నాలి అలాగే కలుపు మొక్కలను పొలాల నుంచి తొలగించాల్సి ఉంటుంది. ఆ తర్వాత రైతులు కుళ్ళిన ఆవు పేడ ఎరువును మట్టిలో కలపాలి. బాగా నీరు పెట్టాలి. తగినంత తేమ ఉన్న సమయంలోనే భూమిని మరోసారి రైతులు దున్నాలి.
ఆ తర్వాత రెండోసారి కూడా భూమిని దున్నిన తర్వాత డిఏపి పొటాష్ కలిపి రోటోవేటర్తో భూమిని దున్నడం వలన మట్టిని వదులుకోవాలని ఆయన చెప్పుకొచ్చారు. పొలంలో ఉన్నా మట్టిని ట్రోవెల్ సహాయంతో సమం చేయాలి. ఆ తర్వాత రైతులు చిన్న పడకలు వేసుకుంటూ కొత్తిమీర విత్తనాలు పొలంలో విత్తుకోవచ్చు. ఈ విధంగా చేయడం వలన నేల సారవంతమైంది గా మారుతుంది. ఆ పొలంలోని పంటలకు మంచి పోషణ కూడా లభిస్తుంది. వ్యవసాయ నిపుణులు డాక్టర్ ఎం సి త్రి పార్టీ మాట్లాడుతూ సాగుకు ఉత్తమమైన కొత్తిమీర రకం కిసాన్ సుగంద్ అని తెలిపారు. ఈ కొత్తిమీర రకం మార్కెట్లో మంచి దిగుబడిని ఇస్తుంది.