Anchor Suma: రాజీవ్ కనకాల, సుమ కనకాల గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. సుమ కనకాల రెండు దశాబ్దాలుగా బుల్లితెర మీద టాప్ యాంకర్ గా రాణిస్తున్నారు. బుల్లితెర షోలతో పాటు సినిమా ఈవెంట్స్ అలాగే స్టార్స్ ఇంటర్వ్యూలు కూడా చేస్తూ సుమ కనకాల చాలా బిజీగా ఉంటుంది. అయితే కెరియర్ స్టార్టింగ్ లో నటిగా చేసిన సుమ ఆ తర్వాత అవకాశాలు రాకపోవడంతో యాంకరింగ్ వైపు వెళ్ళింది. సుమ కేరళ అమ్మాయి అయినప్పటికీ కూడా తెలుగు చాలా చక్కగా మాట్లాడుతూ అతి తక్కువ సమయంలోనే టాలీవుడ్ లో స్టార్ యాంకర్ గా ఎదిగింది.అయితే రీసెంట్ రాజీవ్ కనకాల, సుమ కనకాల దంపతులు తమ పిల్లలు రోషన్ మరియు మనశ్వినితో కలిసి కేరళలోని స్వస్థలం పాలక్కడికి వెళ్లారు.
కేరళలో వీళ్ళు మలయాళీ నూతన సంవత్సరం విసు వేడుకలు చాలా గ్రాండ్గా జరుపుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలలో సుమా కనకాల కూతురు మనస్విని స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. మనస్విని లేటెస్ట్ లుక్ ప్రస్తుతం అందరిని ఆకట్టుకుంటుంది. కేరళ సాంప్రదాయ దుస్తుల్లో మనస్విని చాలా అందంగా ఉంది అంటూ నేటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అయితే గతంలో చాలా బొద్దుగా కనిపించిన మనస్విని ప్రస్తుతం లేటెస్ట్ ఫోటోలలో కాస్త స్లిమ్ అయినట్లు కనిపిస్తుంది.
ఈ ఫోటోలను చూసిన నెటిజెన్స్ షాక్ అవుతున్నారు. సుమ కూతురు చాలా అందంగా ఉంది అంటూ, హీరోయిన్ మెటీరియల్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. అయితే ఇప్పటికే సుమ కొడుకు రోషన్ కనకాల హీరోగా ఎంట్రీ ఇచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. బబుల్ గం అనే సినిమాతో రోషన్ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా యావరేజ్ టాక్ ను సొంతం చేసుకుంది. మొదట్లో రోషన్ను నల్లగా ఉన్నాడు, వీడు అసలు హీరో మెటీరియల్ కాదు అంటూ చాలామంది ట్రోల్ చేశారు. కానీ బబుల్ గమ్ సినిమాలో తన అద్భుతమైన నటనతో తన టాలెంట్ను రోషన్ కనకాల ప్రూవ్ చేసుకున్నాడు. రోషన్ నటనకు విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు వచ్చాయి.
View this post on Instagram