Gurukula: గురుకుల డిగ్రీ మహిళా కళాశాలలో స్పాట్ అడ్మిషన్స్
ఆర్మూర్, జూన్ 27 (ప్రజా శంఖారావం): నిజమాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణ కేంద్రంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ మహిళా గురుకుల డిగ్రీ కళాశాలలో మొదటి సంవత్సరంలో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి స్పాట్ అడ్మిషన్స్ పొందడానికి సంప్రదించాల్సిందిగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్ చంద్రిక శుక్రవారం ఒక ప్రకటన ద్వారా తెలిపారు. ఆసక్తి ఉన్న ఎస్సీ అభ్యర్థుల కోసం స్పాట్ అడ్మిషన్లు జరుగుతున్నాయని ఆమె అన్నారు. కళాశాలలో బీఎస్సీ (ఎంపీసీ, ఎం ఎస్ టి సి ఎస్, బీ జెడ్ సి, ఎం జెడ్ సి) బీకాం (సి ఏ, బి ఏ,) బిఎ (హెచ్ ఈ పి) కోర్సులలో ఎస్సీ సీట్లు ఉన్నాయన్నారు. వివరాల కోసం ఈ ఫోన్ నెంబర్లను 98665 86887,99596 31207 సంప్రదించాల్సిందిగా ప్రిన్సిపాల్ కోరారు.
ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group
Join Now