Vastu Tips: వాస్తు శాస్త్రం ఇంచుమించుగా సైన్స్ తో అనుబంధం ఎక్కువగా ఉంటుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు కొత్త ఇల్లు కట్టుకునేవారు వాస్తు ప్రకారమే కడుతున్నారు. అదే విదంగా ఇంటిలోని వస్తువులను కూడా వాస్తు ప్రకారమే ఏర్పాటు చేసుకుంటున్నారు. వాస్తు ప్రకారం ఇంటిలో ఏర్పాటు చేసుకునే వస్తువుల్లో పిల్లనగ్రోవి ఒకటి. ఈ వస్తువును ఇంటిలో పెట్టుకుంటే ఎలాంటి ఫలితం ఉంటుంది. ఆ వస్తువును ఇంటిలో ఎక్కడ పెట్టుకోవాలి అనే విషయాన్ని వాస్తు నిపుణులు ఈ విదంగా చెబుతున్నారు.
పిల్లనగ్రోవి ఇంటిలో ఉంటె శ్రీకృష్ణుడి ఆశీస్సులు ఉంటాయని వేదంలో కూడా చెప్పబడింది. ఆశీస్సుల వలన ఇంటి కుటుంబ సభ్యులు అందరు కూడా సుఖ సంతోషాలతో ఉంటారు. అదే విదంగా ఆర్థికంగా ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. ఇంటిలో అనుకూల వాతావరణం ఏర్పడి, ప్రతికూల వాతావరణం తొలగిపోతుంది. సిరిసంపదలు పెరుగుతాయి. చేస్తున్న పనులు సకాలంలో పూర్తవుతాయి. వాయిదా పనులు కూడా పూర్తవుతాయి.
వాస్తు శాస్త్ర ప్రకారం పిల్లన గ్రోవి కుబేరుడితో అనుసంధానం. కాబట్టి ఆర్థిక ఇబ్బందులు ఉంటె కూడా తొలగిపోతాయి. పిల్లన గ్రోవిని పూజగదిలో మాత్రమే పెట్టుకోవాలి. పూజ చేస్తున్నప్పుడు తప్పనిసరిగా హారతి ఇవ్వాలి. పూజ వస్తువులతో పాటు పిల్లనగ్రోవిని కూడా శుభం చేసుకోవాలి. పగిలిపోకుండా జాగ్రత్త వహించాలని వేదం పండితులు చెబుతున్నారు.