Job Notification: రాష్ట్ర ప్రభుత్వం గవర్నమెంట్ ఆసుపత్రులలో ప్రజలందరికీ మెరుగైన వైద్యం అందించడానికి అలాగే మెడికల్ కాలేజీలలో కూడా నాణ్యమైన వైద్య విద్యను విద్యార్థులకు బోధించడానికి వేగంగా కసరత్తులు చేస్తుంది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా వైద్య మరియు ఆరోగ్య శాఖలలో అనేక భాగాలలో వేల సంఖ్యలో ఉద్యోగాలు ఖాళీగా ఉన్నందున ప్రభుత్వం ఆ ఉద్యోగాలను బాటిల్ చేయడానికి రెండు నోటిఫికేషన్లను విడుదల చేసింది. తాజాగా గురువారం రోజున తెలంగాణ మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు డెంటల్ అసిస్టెంట్ సర్జన్ మరియు స్పీచ్ పాథాలజిస్ట్ ఉద్యోగాల ఖాళీలను భర్తీ చేయడానికి దరఖాస్తులను ఆహ్వానిస్తూ ఒక నోటిఫికేషన్ జారీ చేసింది.
త్వరలో తెలంగాణ రాష్ట్రంలో భారీ ఎత్తున అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాల భర్తీకి కూడా ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు సమాచారం. ఈ విధంగా వైద్య మరియు ఆరోగ్య శాఖలో కలిపి మొత్తం 52 ఉద్యోగాల పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇక ఇందులో 42 డెంటల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు ఉంటే ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీస్ విభాగంలో 6 డెంటల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు అలాగే నాలుగు స్పీచ్ పాథాలజిస్ట్ పోస్టులు ఉన్నాయని సమాచారం. ఆసక్తి కలిగిన వారు ఆన్లైన్లో ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
జూలై 12 నుంచి జూలై 26 వరకు ఆన్లైన్లో స్పీచ్ పాథాలజిస్ట్ పోస్టులకు అలాగే జూలై 14 నుంచి జూలై 25 వరకు ఆన్లైన్లో డెంటల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. మీరు మరిన్ని వివరాలను తెలుసుకోవడానికి ఎం హెచ్ ఎస్ ఆర్ బి అధికారిక వెబ్సైట్ను సందర్శించండి. అలాగే త్వరలో తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాల పోస్టుల భర్తీకి కూడా నోటిఫికేషన్ జారీ చేస్తున్నట్లు ప్రకటించింది. అయితే ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో మెడికల్ కాలేజీ విద్యా సంవత్సరం ప్రారంభం సందర్భంగా ఈ పోస్టులను భర్తీ చేసేందుకు లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తుంది.