PM Kisan Maandhan Yojana: కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం ఇప్పటివరకు ఎన్నో పథకాల ద్వారా ఆర్థిక సహాయం అందిస్తుంది. అయితే వృద్ధాప్యంలో రైతులకు ఆర్థికంగా భరోసా ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం మరొక పథకాన్ని రైతుల కోసం అమలు చేస్తుంది. రైతులు తమ ఒంట్లో ఓపిక ఉన్నంతవరకు పంటలు సాగు చేస్తూ ఉంటారు. వాళ్లు ఎక్కువగా పంటల మీదనే ఆధారపడతారు. ఇటువంటి రైతులే చల్లగా ఉంటేనే మన కడుపు కూడా చల్లగా ఉంటుంది. అటువంటి రైతులు వృద్ధాప్యంలో ఆర్థిక అవసరాల కోసం ఎన్నో కష్టాలను ఎదుర్కోవలసి వస్తుంది.
కానీ వృద్ధాప్యంలో రైతులను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక మంచి పథకాన్ని తీసుకొని వచ్చింది. 60 ఏళ్లు దాటిన తర్వాత రైతులందరూ కూడా నెల నెల రూ.3వేల రూపాయలు పింఛన్ పొందే విధంగా కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్ మన్ ధన్ యోజన పథకాన్ని అమలు చేస్తుంది. ఈ పథకం రైతులకు వృద్ధాప్యంలో ఆర్థికంగా చాలా సహాయపడుతుంది అని చెప్పొచ్చు. 18 నుంచి 40 ఏళ్లు వయసు ఉన్న రైతులు ఈ పథకానికి అర్హులు. రైతులకు ఐదు ఎకరాలలోపు వ్యవసాయ భూమి ఉండాలి. అర్హులైన రైతులందరికీ 60 ఏళ్ళు దాటిన తర్వాత నెల నెల రూ.3000 రూపాయలు పింఛన్ వస్తుంది.
ఒకవేళ ఎవరైనా రైతు మరణించినట్లయితే అతని నామినికి ప్రతినెల రూ.1500 రూపాయలు పింఛన్ వస్తుంది. దీనికోసం రైతులు ప్రధానమంత్రి కిసాన్ కెఎంవై పోర్టల్ లో అప్లై చేసుకోవాలి. ముందుగా మీరు మీ ఆధార్ కార్డు అలాగే నామిని వివరాలతో ఒక అర్జీని డౌన్లోడ్ చేసుకొని దాని మీద సంతకం చేసి మీరు అప్లోడ్ చేసుకోవాలి. ఆ తర్వాత మీకు పింఛన్ కార్డు ఇస్తారు. మీకు అనుసంధానం అయ్యి ఉన్న బ్యాంకు ఖాతా నుంచి ప్రతినెలా మీరు ప్రీమియం చెల్లిస్తూ ఉండాలి. ప్రతినెలా రైతులు తక్కువ మొత్తంలో ప్రీమియం చెల్లించడం వలన వృద్యాప్యంలో ఎటువంటి ఆర్థిక సమస్యలు లేకుండా హాయిగా జీవితాన్ని గడపవచ్చు.