Chanakya Niti: ముఖ్యంగా యువతకు సంబంధించిన కొన్ని విషయాల గురించి ఆచార్య చాణిక్యుడు నీతి శాస్త్రంలో ప్రస్తావించాడు. ఈ నియమాలను అనుసరించడం వలన యువత తమ జీవితంలో లక్ష్యం సాధించవచ్చు. ఆచార్య చాణిక్యుడు నీతి శాస్త్రంలో వివరించిన నియమాల ప్రకారం యువత తమ జీవితంలో విజయం సాధించాలి అంటే తమ లక్ష్యాన్ని చేరుకోవాలి అంటే ముఖ్యంగా కొన్ని విషయాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఈ నియమాలను పాటించడం వలన జీవితంలోతప్పకుండా లక్ష్యం చేరుకోవచ్చు. యువత అత్యంత విలువైన సమయాన్ని వృధా చేయకూడదు అని ఆచార్య చానిక్యుడు అంటున్నాడు. తమ లక్ష్యాన్ని సాధించడంలో సమయం చాలా విలువైనది.
కాబట్టి అటువంటి సమయాన్ని వృధా చేయకుండా గౌరవించడం అలవాటు చేసుకోవాలి. గడిచిన సమయం మళ్లీ తిరిగి రాదు కాబట్టి అటువంటి విలువైన సమయాన్ని మీరు మీ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఉపయోగించుకోవాలి. ఏ వ్యక్తికైనా అతని సోమరితనం అతని పెద్ద శత్రువు. సోమరితనం కారణంగా వ్యక్తి తన జీవితంలో గొప్ప అవకాశాలను కోల్పోవడం జరుగుతుంది. కాబట్టి సోమరితనాన్ని వదిలేయాలి.సోమరితనాన్ని వదిలేసి జీవితంలో ముందుకు సాగిన వ్యక్తి మాత్రమే జీవితంలో విజయం సాధించగలడు అని ఆచార్య చానిక్యుడు అంటున్నాడు. ఆచార్య చానిక్యుడు నీతి శాస్త్రంలో చెప్పిన దాని ప్రకారం కష్టపడి పని చేయడానికి మనిషి ఎప్పుడూ భయపడకూడదు.
కష్టపడి పనిచేయడానికి భయపడే వ్యక్తి తమ జీవితంలో విజయం సాధించలేడు అని ఆచార్య చాణుక్యుడు అంటున్నాడు. అలాగే ఒక మనిషి జ్ఞానాన్ని సంపాదించడానికి ప్రయత్నించాలి. జీవితంలో మీరు విజయం సాధించాలంటే మందుగా జ్ఞానాన్ని పొందడం చాలా అవసరం. లక్ష్యాన్ని చేరుకోవాలంటే ముందుగా మీరు జ్ఞానాన్ని సంపాదించడానికి సిద్ధంగా ఉండాలి. యువత తమ జీవితంలో ఈ నియమాలను అనుసరించినట్లయితే జీవితంలో వాళ్లు తప్పకుండా విజయం సాధించగలుగుతారు. ఆచార్య చాణిక్యుడు చెప్పిన ఈ నియమాలను ఇప్పటి యువత కూడా అనుసరిస్తున్నారు.