Vastu Tips: కొన్ని రకాల పక్షులు ఇంట్లోకి వచ్చినట్లయితే అవి చాలా అదృష్టాన్ని తీసుకొని వస్తాయి అని వాస్తు శాస్త్రం ప్రకారం చాలామంది నమ్ముతారు. అయితే ఇంట్లోకి చిలుకా లేదా నెమలి వచ్చినట్లయితే చాలా శుభసంకేతంగా పరిగణిస్తారు. నల్ల చీమలు కూడా ఇంటికి చాలా ఆర్థిక ప్రయోజనాలను కలిగిస్తాయి అని వాస్తు శాస్త్రం ప్రకారం నమ్ముతారు. ఇంట్లో ఉన్న ప్రతి స్థలం కూడా భౌతిక శక్తిని ప్రసరింప చేస్తుంది అంటూ వాస్తు శాస్త్రం ప్రకారం నీకు నేను చెబుతున్నారు. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఉన్న కొన్ని వస్తువుల వలన మాత్రమే కాకుండా ఇంటికి అనుకోకుండా వచ్చే కొన్ని పక్షుల వలన కూడా ఆ ఇంట్లో చాలా శుభ పరిణామాలు జరుగుతాయి అని విశ్వసిస్తారు.
కొన్ని పక్షులు ఇంట్లోకి రావడం వలన ఆ ఇంట్లో ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. మీ ఇంటి దగ్గర కాకి కనిపించినట్లయితే ఇంట్లోకి అతిథులు వస్తారని చాలామంది చెప్తారు. ఇదేవిధంగా ఒకవేళ గుడ్లగూబ ఇంట్లోకి వచ్చినట్లయితే ఆ ఇంట్లో శాంతి మరియు శ్రేయస్సు కలుగుతుందని విశ్వసిస్తారు. ఇవన్నీ కూడా పూర్తిగా నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది. అనుకోకుండా ఇంట్లోకి చిలుక ప్రవేశించినట్లయితే ఆ ఇంట్లో వ్యాపారం బాగా అభివృద్ధి చెందుతుందని అర్థం. ఇంట్లో ఉన్న వారి మనసు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది.
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి ఆవరణలో లేదా ఇంట్లోకి నెమలి వచ్చినట్లయితే చాలా శుభ పరిణామంగా చెబుతున్నారు. నెమలి కార్తికేయుడి వాహనం. ఇది అనుకోకుండా ఇంట్లోకి వచ్చినట్లయితే ఆ ఇంట్లో ఉన్న సమస్యలు మరియు కష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయని సంకేతం. నల్ల చీమలు కూడా ఇంట్లో చాలా శుభప్రదంగా పరిగణిస్తారు. ఈ చీమలు ఇంట్లో ఉన్నట్లయితే ఆర్థిక లాభాలు కలుగుతాయని చెప్తారు. నిరుద్యోగులకు కూడా మంచి ఉద్యోగం వస్తుంది. ఏ పని చేపట్టిన పూర్తి అవుతుంది అని నమ్ముతారు.