Chanakya Niti : ఇంట్లో వారికి ఈ అలవాట్లు ఉంటే.. జీవితాంతం పేదరికమే.. ఆచార్య చాణిక్యుడు

Chanakya Niti
Chanakya Niti

Chanakya Niti : ఆచార్య చానిక్యుడు గొప్ప తక్షశిల అధ్యాపకుడు. అతను ఒక సామాన్య బాలుడు అని రాజ్యాధిపతిగా చేసిన గొప్ప రాజా నీతజ్ఞుడు. ఇతనిని కౌటిల్యుడు అలాగే విష్ణుశర్మగా కూడా చెప్తారు. ఆచార్య చాణిక్యుడు రచించిన అర్థశాస్త్రం, నీతి శాస్త్రానికి చాలా ప్రాధాన్యత ఇవ్వబడింది. నీతి శాస్త్రంలో ఆచార్య చానిక్యుడు మనిషి జీవితంలో ఉన్న అనేక సంఘటనలకు సంబంధించి అనేక నియమాలను వివరించారు. అలాగే కొన్ని లక్షణాలున్న స్త్రీలు ఇంట్లో ఉండడం వలన ఆ ఇంట్లో లక్ష్మీదేవి నివసించదని అలాగే సంపద కూడా ఉండదు అని ఆచార్య చాణిక్యుడు తెలిపాడు.

మనిషి జీవితంలో ప్రతి అంశం గురించి కూడా ఆచార్య చాణిక్యుడు నీతి శాస్త్రంలో వివరించాడు. జీవితంలో విజయం సాధించాలంటే ఏం చేయాలో బోధించాడు. అలాగే మిమ్మల్ని వైఫల్యానికి గురి చేసే అనేక విషయాల గురించి కూడా ఆయన చెప్పుకొచ్చాడు. ముఖ్యంగా పేదరికానికి కారణమైన కొన్ని అలవాట్ల గురించి కూడా ఆచార్య జానికి నీతి శాస్త్రంలో వివరించాడు. ఇళ్లలో స్త్రీల స్థితి సరిగ్గా లేకపోతే సంపదకు అధిపతి అయిన లక్ష్మీదేవి అటువంటి ఇంట్లో నివసించదు అని ఆచార్య చాణిక్యుడు అంటున్నాడు. స్త్రీలను అవమానించిన లేదా వారితో చెడుగా ప్రవర్తించిన కూడా ఆ ఇంటి ప్రజలకు పరువు కూడా ఉండదు అని చాణిక్యుడు తెలిపాడు.

కాబట్టి ఇంట్లో సంపాద నిలవాలంటే ఇంట్లో ఉన్న మహిళలతో ఎప్పుడు కూడా దురుసుగా ప్రవర్తించకూడదు. ఇతరులను మోసం చేయడం అహంకారం అంటే అలవాట్లు ఉన్న వ్యక్తులు ఎప్పటికీ కూడా పేదవారీ గానే ఉంటారు. మోసం చేసేవారికి కొంతకాలం వరకు డబ్బు ఉండవచ్చు కానీ ఆ డబ్బు భవిష్యత్తులో వృద్ధి చెందదు అని చాణిక్యుడు అంటున్నాడు. కాబట్టి పొరపాటున కూడా ఇతరులకు మోసం చేయకూడదు. మనిషి అహంకారానికి కూడా దూరంగా ఉండాలి. దుర్భాషలాడే వ్యక్తులపై కూడా లక్ష్మీదేవి అనుగ్రహం ఉండదు అని ఆచార్య చాణిక్యుడు అంటున్నాడు. ముందు వెనుక ఆలోచించకుండా నోటికి వచ్చినట్లు మాట్లాడే వారిపై లక్ష్మీదేవి ఆశీస్సులు ఉండవు. అటువంటివారు ఎప్పటికీ కూడా ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ విజయం సాధించలేరు.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group Join Now