Baba Vanga: బాబావంగా జోస్యం నిజమేనా.. ఆ అలవాటుతో.. ఆరోగ్యం చేతులారా నాశనం చేసుకుంటున్నామా..!

Baba Vanga
Baba Vanga

Baba Vanga: ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరి చేతిలో కూడా స్మార్ట్ ఫోన్ కనిపిస్తుంది. కేవలం అవసరానికి ఉపయోగించాల్సిన ఫోన్లో అవి అలవాటుగా మారి చివరకు మనిషిని బానిసలను చేస్తున్నాయి. ఇది చాలా పెద్ద అనర్ధానికి దారితీస్తుందని బాబావంగా ఎప్పుడో జోస్యం చెప్పడం జరిగింది. బాబా వంగ ప్రజల చేతుల్లో ఉన్న ఫోన్లే వాళ్ల ఆరోగ్యాలను క్రమక్రమంగా నాశనం చేస్తాయని వివరించారు. ప్రస్తుతం పెరుగుతున్న టెక్నాలజీ మనిషి జీవితాన్ని మారుస్తున్నాయి అన్నది ఎంత నిజమో అది ఒక మనిషికి మరో మనిషికి మధ్య దూరం పెంచుతుంది అనేది కూడా నిజమే. మారుతున్న కొత్త టెక్నాలజీని అందిపుచ్చుకోవడం చాలా అవసరం. అలాగే ఆ టెక్నాలజీకి అలవాటు పడకుండా బానిసలు కాకుండా మనల్ని మనం కాపాడుకోవడం కూడా చాలా ముఖ్యం.

లేకపోతే సాంకేతిక విపరీతమైన ప్రభావాలు మానసికంగా మరియు శారీరకంగా కూడా కనిపిస్తాయి. దీని గురించి బాబావంగా ఏనాడో జోస్యం చెప్పడం జరిగింది. చాలామంది బల్గేరియా కు చెందిన బాబా వంగా గురించి వినే ఉంటారు. ఇప్పటివరకు ఆమె చెప్పిన చాలా జోస్యాలు నిజం కూడా అయ్యాయి. చిన్నతనంలోనే తన చూపు కోల్పోయిన బాబా వంగ ప్రపంచ యుద్ధాలు, ప్రకృతి విలయాలు, విపత్తుల గురించి ఏనాడో జోస్యం చెప్పారు. వీటిలో చాలావరకు నిజం కూడా అయ్యాయి. 2020లో వచ్చిన కరోనా మహమ్మారి గురించి కూడా బాబావంగా ముందుగానే ఊహించారు. అప్పట్లో ఆమె చెప్పిన గ్యాడ్జెట్ ప్రొడక్షన్ కూడా నిజమయింది.

ఆనాడే బాబా వంగ మనుషులు ఒక సాంకేతిక పరికరానికి బానిసలు అవుతారని అంజనా వేశారు. ఈ మధ్యకాలంలో మొబైల్ ఫోన్కు చాలామంది బానిసలుగా మారుతున్న సంగతి తెలిసిందే. చిన్న చిన్న పిల్లలనుంచి పెద్దవాళ్ల వరకు ప్రతి ఒక్కరు కూడా మొబైల్ ఫోన్కు అలవాటు పడిపోయారు. ఉదయం నిద్ర లేచిన దగ్గరనుంచి రాత్రి పడుకునే వరకు మరి కొంతమంది నిద్ర మానుకొని మరి ఫోన్ వాడుతున్నారు. మొబైల్ ఫోన్ల ఎక్కువ వాడకం వలన నిద్రలేమి, ఆరోగ్య సమస్యలు, మానసిక ఒత్తిడి, మతిమరుపు వంటి సమస్యలు కూడా ఎక్కువవుతున్నాయి.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group Join Now