Pension Scheme: కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాలలో అటల్ పెన్షన్ యోజన పథకం కూడా ఒకటి. పదవి విరమణ పథకాలలో అటల్ పెన్షన్ యోజన పథకం బాగా గుర్తింపు పొందింది. దీని సబ్స్క్రైబర్ బేస్ ఏప్రిల్ 2025 నాటికి 7.65 లక్షలకు చేరుకుందని సమాచారం. మొత్తంగా పెన్షన్ ఫండ్లో రూ.45,974.67 లక్షల కోట్లు. ఈ మొత్తం జనాభాలో ఉన్న చందాదారులలో మహిళలు 48% కావడం విశేషం అని చెప్పొచ్చు. అటల్ పెన్షన్ యోజన పథకం మే 9, 2015లో ప్రారంభమైంది. ఇది చాలా సులభమైన మరియు తక్కువ వాయిదాల చెల్లింపులను ప్రజలకు అందిస్తుంది.
ఈ పథకంలో మీకు ప్రభుత్వం నుండి కూడా సహకారం లభిస్తుంది. పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ అటల్ పెన్షన్ యోజన పథకాన్ని నిర్వహిస్తుంది. జాతీయ పెన్షన్ పథకం కింద ఇది వస్తుంది. ఇది ఒక ప్రభుత్వ పెన్షన్ పథకం. దీంట్లో మీకు 60 ఏళ్ల తర్వాత అంటే పదవి విరమణ అయిన తర్వాత నెలవారి పెన్షన్కు మీకు హామీ ఉంటుంది. ఇందులో మీకు పెన్షన్ వెయ్యి రూపాయల నుంచి 5000 రూపాయల వరకు ఉంటుంది.
ఆ వ్యక్తి పెట్టుబడిపై నెలవారి పెన్షన్ ఆధారపడి ఉంటుంది. ప్రతినెల చెల్లింపులు రు.42 రూపాయల నుంచి రూ.1454 రూపాయల వరకు ఉంటాయి. దీనికి కనీస పెట్టుబడి కాలపరిమితి 20 ఏళ్లు. గరిష్ట కాల పరిమితి 42 ఏళ్ళు. 60 సంవత్సరాల వయస్సు వరకు మాత్రమే ప్రీమియం చెల్లింపు ఉంటుంది. 60 ఏళ్లు పూర్తయిన తర్వాత పింఛన్ కాలం మొదలవుతుంది. ప్రతినెలా మీకు 1000 నుంచి ₹5000 వరకు పెన్షన్ అందుతుంది. ప్రీమియం చెల్లించే దానిపై నెలవారి పెన్షన్ ఆధారపడి ఉంటుంది.