Vastu Tips: ఇంట్లో తాళాలను పొరపాటున కూడా ఈ దిశలో పెట్టకూడదు.. ఎక్కడ పెట్టాలంటే

Vastu Tips
Vastu Tips

Vastu Tips: ఇంట్లో తాళం చెవిని పెట్టడానికి కూడా వాస్తు శాస్త్రంలో సరైన దిశ చెప్పబడింది. ఇంట్లో ఎక్కడపడితే అక్కడ తాళం లేదా తాళం చెవిని పెట్టకూడదు. అయితే పొరపాటున కూడా ఈ ప్రదేశాలలో తాళం చెవిని పెట్టినట్లయితే అనేక సమస్యలను ఎదుర్కోవాలి. మనిషి జీవితంలో వాస్తు శాస్త్రం చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. జీవితంలో అనేక సమస్యలకు వాస్తు శాస్త్రంలో పరిష్కారం చెప్పబడింది. మీరు ఏదైనా కొత్త విషయాన్ని చేపట్టబోతున్నప్పుడు వాస్తు శాస్త్రాన్ని తప్పకుండా దృష్టిలో పెట్టుకోవాలి. వాస్తు శాస్త్రం కోసం ఇంట్లో ఉన్న వస్తువులను అమర్చుకోవడం వల్ల ఆ ఇంట్లో శుభం కలుగుతుంది అని చాలామంది నమ్మకం.

ప్రతి ఒక్కరు ఇంట్లో కూడా తాళం ఉంటుంది. బయటకు వెళ్లేటప్పుడు ప్రతి ఒక్కరూ తమ ఇంటిని తాళం వేసి వెళతారు. అయితే ఇంట్లో తాళం పెట్టే సమయంలో కూడా వాస్తు శాస్త్రాన్ని అనుసరించాలి. లేకపోతే చాలా సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. పొరపాటున కూడా కొన్ని ప్రదేశాలలో తాళం చెవిని పెట్టకూడదు. కొంతమంది తాళాలు పోతాయి అని భావించి కొన్ని ప్రత్యేక స్థలాలలో వాటిని పెడతారు. కొంతమంది పూజ గదిలో తాళం చెవిని పెడతారు. కానీ వాస్తు శాస్త్రం ప్రకారం పూజగదిలో తాళం చెవిని పెట్టకూడదు. పూజ గదిలో సానుకూల శక్తి ఉంటుంది.

అలాగే ఇంట్లో ఉన్న బ్రహ్మ స్థానంలో తాళం చెవిని పెట్టకూడదు. తాళం చెవిని ఇనుముతో తయారుచేస్తారు కాబట్టి ఈ ప్రదేశంలో తాళం చెవి పెట్టడం వలన ప్రతి కుల శక్తి కలుగుతుంది. ఇంట్లో అనేక సమస్యలు ఏర్పడవచ్చు. ఇంటి ఈశాన్యం మూలలో కూడా తాళంచలేని పెట్టకూడదు. ఇది చాలా పవిత్రమైన స్థలం. దీన్ని ఎంతో శుభ్రంగా పెట్టుకోవాలి. కాబట్టి లోహంతో చేసిన తాళం చెవిని పొరపాటున కూడా ఈ దిశలో పెట్టకూడదు. లోహంతో తయారుచేసిన తాళం చెవిని ఇంట్లో కొన్ని చోట్ల పెట్టడం వలన లాభం కలుగుతుంది. ఒకవేళ లాభం కలగకపోయినా నష్టం మాత్రం జరగదు. ఇంటి వాయువ్యదిశలో తాళం చెవిని పెట్టాలి. ఇంట్లో ఉండే సేఫ్ తాళాలను నైరుతి దిశలో పెట్టుకోవాలి.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group Join Now