Smart Phone: ప్రతి ఏడాది కూడా మనదేశంలో కొన్ని లక్షల ఫోన్లో పోగొట్టుకుంటున్నట్లు పోలీస్స్టేషన్లలో కేసులు నమోదు అవుతున్నాయి. అయితే ప్రభుత్వం పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లలో దాదాపు 33.5 లక్షల ఫోన్లో సంచార్ సాథీ పోర్టల్ ద్వారా బ్లాక్ చేసి అందులో 20.28 లక్షల ఫోన్లను ట్రాక్ చేశారు. సి డాట్ ద్వారా సంచార్ సాథీ పోర్టల్ అభివృద్ధి చేయబడింది. మన ఫోన్ పోతే మనం చాలా ఇబ్బందులను ఎదురు కావలసి వస్తుంది. కష్టపడి సంపాదించిన డబ్బుతో ఫోన్లను కొనుగోలు చేస్తూ ఉంటారు. డబ్బులను దాచుకొని ఖరీదైన ఫోన్లను కొని వాటిని చాలా జాగ్రత్తగా పెట్టుకుంటాము. అయితే అటువంటి ఫోన్లు అనుకోకుండా పోతే మనకు సరిగ్గా నిద్ర కూడా పట్టదు. మన వ్యక్తిగత డేటా మొత్తం మన ఫోన్లో ఉంటుంది.
అయితే మీరు ఫోన్ పోయిన వెంటనే ఈ విధంగా చేసినట్లయితే మీ పోయిన ఫోన్ మళ్ళీ మీకు తిరిగి దొరుకుతుంది. ఇప్పటివరకు 33.5 లక్షల పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లో సంచార్ సాథీ ఫోటోలు ద్వారా బ్లాక్ చేశారు. అలాగే అందులో 20.28 లక్షల ఫోన్లను ట్రాక్ కూడా చేశారు. ఈ పోటోలను ఉపయోగించి మీరు మీ ఫోన్ ఎక్కడ ఉందో తెలుసుకోవచ్చు. టెలికాం డిపార్ట్మెంట్ సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్ ద్వారా ఈ పోర్టల్ అభివృద్ధి చేయబడింది. తమ పోగొట్టుకున్న స్మార్ట్ ఫోన్ను ఈ పోర్టల్ ద్వారా బ్లాక్ చేసుకునే అవకాశం ఉంది. అలాగే మీ ఫోన్ ఎక్కడ ఉందో ట్రాక్ చేసి మళ్లీ తిరిగి పొందవచ్చు. ఈ మొత్తం ప్రాసెస్ సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ వ్యవస్థ ద్వారా జరుగుతుంది కాబట్టి మీ ఫోన్ మళ్ళీ మీరు తిరిగి పొందవచ్చు.
ఒకవేళ మీ ఫోన్ పోయినట్లయితే మీరు ఒక డూప్లికేట్ సిమ్ను పొందండి. టెలికాం సర్వీసెస్ వాళ్లను సందర్శించి మీరు ఆ నెంబర్ తోనే మరొక సిమ్ కార్డును కొనండి. ముందుగా ఫోన్ పోయినా లేదా దొంగలించబడిన కూడా పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేయండి. అధికారికా వెబ్సైట్ అయినా https://www.ceir.gov.in లో స్టోలెన్ లేదా లాస్ట్ మొబైల్ ను బ్లాక్ చేయడంపై క్లిక్ చేయండి. ఐ ఎం ఈ ఐ నెంబర్, పోలీసు ఫిర్యాదు నెంబర్ తో పాటు ఆధార్ లింక్ చేయబడిన చిరునామా అలాగే ప్రత్యామ్నాయ కాంటాక్ట్ నెంబర్ వంటి అన్ని వివరాలను నమోదు చేయండి.