Vastu Tips: ఇంట్లో ఈ చిన్న చిన్న మార్పులు చేసి చూడండి.. కాసుల వర్షం కురుస్తుంది

Vastu Tips
Vastu Tips

Vastu Tips: కొంతమంది బాగా సంపాదించినా కూడా వాళ్ళ ఇంట్లో డబ్బు నిలువ ఉండదు. ఆదాయం వచ్చిన వెంటనే ఖర్చు కూడా అయిపోతుంది. ఎంత జాగ్రత్తలు తీసుకున్న కూడా చేతిలో ఒక్క రూపాయి ఉండదు. అయితే దీనికి ఇంట్లో ఉండే ప్రతికూల శక్తి కూడా ఒక కారణం కావచ్చు అని చెప్పొచ్చు. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడాలంటే ఇంట్లో కొన్ని సింపుల్ చిట్కాలను పాటించాలి. ప్రతిరోజు ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం వలన ఆ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుందని నిపుణులు చెప్తున్నారు. ముఖ్యంగా ఇంట్లో వాసనలు, చెత్తాచెదారం, దుమ్ము వంటివి ఉన్నట్లయితే ఆ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. కాబట్టి ప్రతిరోజు ఇంటిని శుభ్రపరుచుకోవాలి. అందమైన తోరణాలు అలాగే పూల మొక్కలతో ఇంటిని అందంగా మార్చుకోవాలి.

అందంగా ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి ఉంటుంది అని చాలామంది నమ్మకం. పనికిరాని లేదా పాడైపోయిన వస్తువులు ఉంటే వెంటనే ఇంట్లో నుంచి తీసేయాలి. ఇంట్లో డబ్బు నిలవక పోవడానికి ఇవి కూడా ఒక కారణం కావచ్చు. ముఖ్యంగా ఇంట్లో పగిలిన అద్దాలు, పగిలిన గిన్నెలు వంటివి పెట్టుకోకూడదు. ఇవి ఇంటి అందాన్ని తగ్గించడంతో పాటు మంచి శక్తులు ఇంట్లోకి రాకుండా అడ్డుపడతాయని నిపుణులు చెప్తున్నారు. ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరగాలి అంటే ఆ ఇంట్లో పనికిరాని వస్తువులను పెట్టుకోకూడదు. ముందు ఇంటి ప్రధాన ద్వారం శుభ్రంగా ఉండేలాగా చూసుకోవాలి. ప్రతిరోజు దానిపై కొంచెం శ్రద్ధ పెట్టాలి.

ఇంటి ప్రధాన ద్వారం దగ్గర చెప్పులు లేదా బూట్లు అలాగే మురికిగా ఉండే వస్తువులను పెట్టకూడదు. ఇలా చేయడం వలన ఆ ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ రాదు. ప్రధాన ద్వారం ఎల్లప్పుడూ శుభ్రంగా మరియు ప్రకాశవంతంగా ఉండాలి. ఇంటిని కూడా అందంగా అలంకరించుకోవాలి. ఇంట్లో తులసి మొక్క అలాగే రంగురంగుల మొక్కలతో అలంకరణ చేసుకోవాలి. ఇలా చేయడం వలన ఆ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. అలాగే ఇంట్లో కుళాయిల నుంచి నీరు కారుతున్న కూడా ఆ ఇంట్లో డబ్బు నష్టం కలుగుతుందని నమ్ముతారు. కాబట్టి ఇంట్లో ఏవైనా లీకేజీలు ఉంటే వాటిని వెంటనే సరి చేసుకోవాలి.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group Join Now