Massive theft in town: మెడికల్ షాపుల్లో దొంగల హల్చల్

Massive theft in town: ఆర్మూర్ టౌన్, డిసెంబర్ 11 (ప్రజా శంఖారావం): నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలో బుధవారం వేకువజామున దొంగలు హల్చల్ చేశారు. దొండి మెడికల్, కేర్ మెడికల్, స్కానింగ్ సెంటర్లలో సుమారు 6 లక్షల నలభై వేల రూపాయలతో పాటు ఒక టీవీని దోచుకెళ్లినట్లు బాధితులు తెలిపారు. మహారాష్ట్ర పాసింగ్ నెంబర్ తో ఉన్న టాటా ఏసీ వాహనంలో దర్జాగా నలుగురు దుండగులు పట్టణ నడిఒడ్డులో దొంగతనానికి పాల్పడడం స్థానికంగా భయాందోళనకు గురిచేసింది. బాధితుల ఫిర్యాదు మేరకు ఆర్మూర్ ఎస్ హెచ్ ఓ సత్యనారాయణ గౌడ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

 

 

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group Join Now