Meghastar Chiranjeevi | విశ్వంభర సినిమాలో.. మెగాస్టార్ చెల్లిగా నటిస్తున్న హీరోయిన్ ఎవరో తెలుసా..!
మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న విశ్వంభర సినిమా గురించి ఆయన అభిమానులు ఎంతగానో ఆరటంగా ఎదురుచూస్తున్నారు. మెగాస్టార్ సినిమా విడుదల అవుతుందంటే చాలు ఆయన వీర అభిమానులు ఆయన సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అంటూ కాచుకొని చూస్తారు. మెగాస్టార్ పక్కన నటించడానికి కూడా ఎంతోమంది ప్రముఖ హీరోయిన్లు తహతహలాడుతారు. ఇండస్ట్రీలో మెగాస్టార్ కు ఉన్న క్రేజీ అలాంటిది. మరి మెగాస్టార్ కి ఈ సినిమాలో చెల్లి క్యారెక్టర్ గా నటిస్తున్న హీరోయిన్ ఎవరో తెలుసా..? ఎవరో కాదు ఒకప్పుడు వెబ్ సిరీస్ లో ఆమె తన అందచందాలతో కుర్రకారును ఉర్రూతలూగించి ఆమెకంటూ ఒక గుర్తింపును తెచ్చుకుంది.

హీరోయిన్ గా పాపులారిటీ..
అలా ఈ అందాల భామకు వరుసగా ఇప్పుడు అవకాశాలు అందివస్తున్నాయి. తాజాగా ఈ అందాల అమ్మడు ఒక సినిమాలో కూడా నటించింది. ప్రస్తుతానికి ఆ సినిమా విడుదల కోసం సిద్ధంగా ఉంది. చాలామంది అందాల భామలు బుల్లితెరపై పరిచయమై ఎంతోమంది పాపులర్ హీరోయిన్ లుగా ఛాన్సులు అందుకున్నారు. అలాంటి వారిలో ఈ అందాల ముద్దుగుమ్మ కూడా ఒకరు. హీరోయిన్ గా పాపులారిటీ రాకముందు ఈ ముద్దుగుమ్మ చిన్నచిన్న వీడియోలు, ఇంస్టాగ్రామ్ లాలో రీల్స్ వంటివి చేస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని ఈ ముద్దుగుమ్మ సంపాదించుకుంది. అలా పరిచయమైన ఈ అందాల భామ ప్రేక్షకులను తన ఒంపు సొంపులతో వయ్యారి నటనతో ఇప్పుడు ఒక మంచి హీరోయిన్ గా ప్రేక్షకుల ఎదురుగా రానుంది.
అలా ఇప్పటివరకు ఐదు సినిమాలు చేసిన ఈ ముద్దుగుమ్మ రెండు సినిమాలు హిట్ అయ్యాయి. ఇప్పుడు ఏకంగా మెగాస్టార్ సినిమాలో ఛాన్స్ అందుకొని చిరు పక్కన చెల్లిగా నటించే ఛాన్స్ కొట్టేసింది. సినిమా రంగంలో దాదాపుగా సోషల్ మీడియాలో తమకంటూ ఒక ఇమేజ్ సంపాదించుకొని ఫ్యాన్సును తమ వైపు ఆకట్టుకునేలా రిల్స్ ప్రదర్శిస్తూ బుల్లితెరపై నటించినా చాలామంది యాంకర్లు ఇప్పుడు సినిమాలలో నటిస్తూ తమకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకొని వారి నటన నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ పెద్దపెద్ద డైరెక్టర్లతో, హీరోలతో నటించే అవకాశాన్ని పొందుతున్నారు. అలాంటివారిలో ఈ అందాల భామ ఒకరు.

అంతేకాదు సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు కుర్రాళ్లకు ఒక డ్రీమ్ గర్ల్ గా మారి తన అంద చెందాలతో అందరి మతిపోగొడుతుంది. ఇంతకీ ఎవరు ఈ ముద్దుగుమ్మ అనుకుంటున్నారా..! ఇంకెవరో కాదు మొన్నటికి మొన్న 2018లో విడుదలైన “హుషారు” అనే తెలుగు సినిమాతో పరిచయమైన “పసుపులేటి రమ్య” ఈ ముద్దుగుమ్మ పేరు. ఈ అమ్మడు ఇప్పటివరకు.. మైల్స్ ఆఫ్ లవ్, బి ఎఫ్ ఎఫ్, ఫస్ట్ ర్యాంక్ రాజు.. లాంటి సిరీస్ లో నటించింది. తాజాగా “మ్యాడ్ 2” సినిమాలో కూడా నటించింది. ఆ సినిమాతో ప్రేక్షకుల ముందు కూడా ఈ అందాల ముద్దుగుమ్మ రమ్య పసుపులేటి రానుంది. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర సినిమాలో ఆయన పక్కన చెల్లిగా రమ్య పసుపులేటి నటించబోతుందని సినిమా ఇండస్ట్రీలో టాక్.