October 9, 2024
Minister conduct meeting on Gulf, NRI polacies
Minister conduct meeting on Gulf, NRI polacies

Ministerial meeting on Gulf Board: గల్ఫ్ బోర్డు ఎన్నారై పాలసీలపై మంత్రి సమావేశం

Ministerial meeting on Gulf Board: నిజామాబాద్ జిల్లా, సెప్టెంబర్ 14 (ప్రజా శంఖారావం): హైదరాబాద్ లోని సచివాలయంలో గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యల గురించి రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధ్యక్షతన శనివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచన మేరకు అందుబాటులో ఉన్న గల్ఫ్ ప్రభావిత ప్రాంతాల ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్ లతో పాటు గల్ఫ్ వలసల నిపుణులు, అధికారులు, ఆయా నియోజకవర్గాల ఇన్చార్జిలతో సమావేశాన్ని నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కన్వీనర్ గా వ్యవహరించి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

4 హామీల అమలుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉంది

2023 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో అభయహస్తం పేరుతో గల్ఫ్ కార్మికులు, ఎన్నారైల సంక్షేమం కోసం ఇచ్చిన 4 హామీల అమలుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి స్పష్టం చేశారు. ఈ సమావేశంలో గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి ముందుగా నాలుగు అంశాలపై ప్రభుత్వం జీవో తీయాలని నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజు నుండి గల్ఫ్ దేశాల్లో మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు 5 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా, గల్ఫ్ వలస కార్మికుల సంక్షేమంపై అధ్యయనం చేయడానికి ప్రభుత్వం ఒక సలహా కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీంతోపాటు హైదరాబాదులోని ప్రజా భవన్ లో నిర్వహిస్తున్న ప్రజావాణిలో గల్ఫ్ కార్మికులు, ఎన్నారైల కోసం ప్రత్యేక ప్రవాసి ప్రజావాణి కౌంటర్ ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి చెప్పారు. గురుకుల పాఠశాల, కళాశాలల్లో గల్ఫ్ కార్మికుల పిల్లలకు అడ్మిషన్లలో ప్రాధాన్యత కల్పిస్తామని నిర్ణయం తీసుకున్నారు.

ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు మేడిపల్లి సత్యం, డాక్టర్ మాకునూరి సంజయ్ కుమార్, కె ఆర్ నాగరాజు, డాక్టర్ ఆర్ భూపతిరెడ్డి, జహీరాబాద్ ఎంపీ సురేష్ రెడ్డి, కార్పొరేషన్ల చైర్మన్లు ఈరవత్రి అనిల్, సుంకేట అన్వేష్ రెడ్డి, ఆర్మూర్ నియోజకవర్గ ఇన్చార్జి పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి, నిర్మల్ డిసిసి అధ్యక్షులు కుచాడి శ్రీనివాసరావు, వలసనిపుణులు అంబాసిడర్ డాక్టర్ బి.ఎం వినోద్ కుమార్, గల్ఫ్ వలస కార్మిక నాయకులు మంద భీమ్ రెడ్డి, సింగిరెడ్డి నరేష్ రెడ్డి, చెన్నమనేని శ్రీనివాసరావు, స్వదేశ్ పరికిపండ్ల, గల్ఫ్ జేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లిజీ జోసెఫ్, వెలిశాల రాజేందర్ రావు, పత్తి రెడ్డి రాజేశ్వర్ రెడ్డి, ఎన్నారై విభాగం అధికారి చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
WhatsApp Group Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!