Muncipality: అక్రమకట్టడాలు @ ఆర్మూర్

Armoor Muncipality
Armoor Muncipality

*యథేచ్చగా నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు
*అనుమతులు ఒకటి.. నిర్మాణాలు మరొకటి..
*క్షేత్రస్థాయిలో నిర్మాణాలపై పరిశీలన కరువు..
*నిద్రావస్థలో టౌన్ ప్లానింగ్ సిబ్బంది..
*నిర్మాణాల పై వివరాలడిగితే.. అధికారుల మాట దాటవేత..

Muncipality: నిజామాబాద్ ఉమ్మడి జిల్లా ప్రతినిధి, జూలై 26 (ప్రజా శంఖారావం): కంచే చేను మేస్తే కాపాడేదెవరు అన్న చందంగా తయారయింది మున్సిపల్ అధికారులు తీరు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు జరుగుతున్న సంబంధిత టౌన్ ప్లానింగ్ శాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరించడం పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మున్సిపల్ పరిధిలోని నిర్మాణాల వివరాలు అడిగితే అధికారులు మాట దాటేస్తున్నారు. కొన్నిచోట్ల నిర్మాణాలకు కావలసిన అనుమతులు ఒక విధంగా ఉంటే నిర్మాణాలు మాత్రం మరోలా జరుగుతున్నాయి. అక్రమార్కులకు అధికారులే సహకరిస్తున్నారన్న ఆరోపణలు జోరుగా వినబడుతున్నాయి. క్షేత్రస్థాయిలో పరిశీలించాల్సిన అధికారులు నిద్రావస్థలో ఉంటున్నారని పట్టణవాసులు ఆరోపిస్తున్నారు.

Also Read:నిబంధనలకు విరుద్ధంగా నియామకాలు..!

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని 36 వార్డులలో జరుగుతున్న కొన్ని నిర్మాణాలు నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్నారని ఆరోపణలు వెలువడుతున్నాయి. మున్సిపల్ శాఖ నుండి తీసుకోవాల్సిన అనుమతులు కొంతమంది తీసుకోకపోగా, అక్రమ నిర్మాణాలపై అధికారుల దృష్టికి తీసుకువెళ్లిన అధికారులు ఉదాసీనగా వ్యవహరిస్తూరన్న ఆరోపణలు కూడా జోరుగా ఉన్నాయి. సంబంధిత టౌన్ ప్లానింగ్ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో నిర్మాణాలపై పర్యవేక్షణ కరువైందని నిర్మాణాల తీరు చూస్తే తేటతెల్లమవుతుంది.

ప్రధాన రహదారుల గుండా నిర్మించే కమర్షియల్ నిర్మాణాలు పూర్తిగా నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్న అధికారులు అటువైపు కన్నెత్తి చూడడం లేదని బహిరంగంగానే విమర్శలు వెలువెత్తుతున్నాయి. కొంతమంది భవన నిర్మాణదారులు పాత నిర్మాణాలపై ఎలాంటి అనుమతులు లేకుండానే కొంతమంది మున్సిపల్ శాఖ అధికారుల అండతో యథేచ్చగా నిర్మాణాలు కొనసాగిస్తున్నారని ఫిర్యాదులు కూడా టౌన్ ప్లానింగ్ అధికారులు మూటగట్టుకుంటున్నారు. మున్సిపల్ కార్యాలయంలోని టౌన్ ప్లానింగ్ సిబ్బందిపై మున్సిపల్ కమిషనర్ పర్యవేక్షణ పూర్తిగా విఫలమైందని పట్టణవాసులు ఆరోపిస్తున్నారు.

Also Read:పెదవి దాటిన ప్రగల్బాలు.. పారిశుద్ధ్యం దరికి చేరని పార, గమేళా..!

ఎక్కడికి కక్కడే అక్రమ నిర్మాణాలు జరుగుతూ ఉంటే అడ్డుకోవాల్సిన అధికారులు వారికి అండగా నిలబడుతున్నారని ఆరోపణలు లేకపోలేదు. నిబంధనలు విరుద్ధంగా నిర్మాణం అవుతున్న భవనాల వివరాలు టౌన్ ప్లానింగ్ అధికారులను తెలుపమని కోరితే మాట దాటవేస్తూ కాలయాపన చేస్తున్నారే తప్ప వివరాలు తెలపడం లేదని మరికొంతమంది ఆరోపిస్తున్నారు. అక్రమ నిర్మాణాలను అడ్డుకోవాల్సిన అధికారులు వారికి వత్తాసు పలకడంపై పట్టణవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ప్రధాన రహదారుల గుండా నిర్మించే నిర్మాణాలు ఎలాంటి సెట్ బ్యాకులు పాటించకుండా నిర్మాణాలు జరపడంతో గల్లీలోని రోడ్లు ఇరుకుగా తయరవుతున్నాయని కాలనీవాసులు వాపోతున్నారు. మున్సిపల్ పరిధిలోని కమలా నెహ్రూ కాలనీ, తిరుమల కాలనీ, మామిడిపల్లి, కోటార్మూర్ ప్రాంతాల్లో నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు జరుగుతున్నాయని పట్టణ వాసులు ఆరోపిస్తున్నారు.

Muncipal Commissioner A Raju
Muncipal Commissioner A Raju
మున్సిపల్ కమిషనర్ ఏ రాజు వివరణ:

ఫీల్డ్ మీదికి వెళ్లి నేను చూడలేను. కాబట్టి మీరు నా దృష్టికి తీసుకొచ్చిన విషయాన్ని టౌన్ ప్లానింగ్ వాళ్ళతో మాట్లాడతాను. ఒకవేళ ఏదైనా బిల్డింగ్ నిర్మాణాల్లో డీవియేషన్స్ ఉన్నట్లయితే కచ్చితంగా వాటిపై చర్యలు తీసుకుంటాం. టౌన్ ప్లానింగ్ వాళ్లకు కూడా చెప్పడం జరిగింది. ప్రతి బిల్డింగ్ నిర్మాణాన్ని పరిశీలించాలని ఆదేశించాం. ఇక ముందు కూడా ఖచ్చితంగా ఇన్స్పెక్షన్ చేయాలని సూచిస్తాం. నా నోటీసులోకి తీసుకువచ్చిన ఈ బిల్డింగ్లపై విచారణ చేసి దివియేషన్స్ ఉంటే ఖచ్చితంగా శాఖ పరమైన చర్యలు ఉంటాం.

Also Read:పెదవి దాటిన ప్రగల్బాలు.. పారిశుద్ధ్యం దరికి చేరని పార, గమేళా..!

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group Join Now