Revanth Reddy: నియోజకవర్గాల పునర్విభజన రాష్ట్రంలో జరుగనుంది. ఈ నేపథ్యంలో నియోజక వర్గాల సంఖ్య రాష్ట్రంలో పెరగనుంది. 119 నుంచి సుమారుగా 150 వరకు నియోజకవర్గాలు ఏర్పడుతాయి. కాబట్టి రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అందరం కలిసి కట్టుగా పనిచేస్తేనే మరోసారి కాంగ్రెస్ పార్టీ అధికారం చేపడుతుందని సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల హైదరాబాద్ లో జరిగిన ఒక కార్యక్రమంలో స్పష్టం చేశారు.
ఇప్పుడు నియోజకవర్గాల పునర్విభజన కాంగ్రెస్ శ్రేణుల్లో ఆశలు పెంచాయి. అంతే కాదు భాద్యతలు కూడా పెరుగనున్నాయి. అందరు కలిసి కట్టుగా పనిచేస్తేనే పార్టీ రెండోసారి అధికారంలోకి వస్తుంది. లేదంటే రాజకీయ నిరుద్యోగం తప్పదు. నియోజకవర్గాలు పెరిగితే పార్టీకి పని భారం పెరుగుతుంది. గెలుపు గుర్రాలను ఎంపిక చేయడం కూడా కత్తి మీద సామే అవుతుంది.
రాష్ట్రాన్ని ఎంత అభివృద్ధి చేసినప్పటికీ రెండోసారి అధికారంలోకి పార్టీని తీసుకు రావడం ఒక్క సీఎం రేవంత్ రెడ్డి తో సాధ్యమయ్యే పనికాదు. అసెంబ్లీ బరిలో నిలిచిన అభ్యర్థి గెలుపు కోసం గల్లీ కార్యకర్త నుంచి మొదలుకొని నియోజకవర్గం స్థాయి నాయకుడి వరకు ఐకమత్యంతో పనిచేస్తేనే విజయం సాధ్యమవుతుంది. ఏకతాటిపై ఉండకుండా, అభివృద్ధి ఎంత చేసినా ఫలితం శూన్యమే. అందుకే సీఎం
ఎక్కడికి వెళ్లిన సుతిమెత్తగానే పార్టీ శ్రేణులను హెచ్చరిస్తున్నారు.