Online Shopping: త్వరలో అమెజాన్ ప్రైమ్ డే 2025 సేల్ ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా అమెజాన్లో స్మార్ట్ ఫోన్లు, టీవీలు, హోమ్ అప్లయెన్సెస్ వంటి వాటిపై భారీగా డిస్కౌంట్ లభిస్తుంది. మూడు రోజులపాటు ఈ సేల్ మీకు అందుబాటులో ఉంటుంది. చాలామంది ప్రముఖ ఆన్లైన్ అమెజాన్లో తరచూ షాపింగ్ చేస్తూ ఉంటారు.
అయితే ప్రతి ఒక్కరు కూడా అమెజాన్ వారు అందించే ప్రత్యేక సేల్ లేదా బిగ్ బిలియన్ డే కోసం ఎదురు చూస్తూ ఉంటారు. తాజాగా అమెజాన్లో షాపింగ్ చేసే కస్టమర్ల కోసం అమెజాన్ ఒక అద్భుతమైన ప్రకటన చేసింది. అమెజాన్ ప్రైమ్ డే 2025 సేల్ లో మీరు స్మార్ట్ ఫోన్లు, గృహపకరణాలు, లాప్టాప్ లో, టాబ్లెట్లు ఇలా ఏ వస్తువు కొనాలన్న భారీ డిస్కౌంట్తో లభిస్తుంది.
ఈ ప్రత్యేక సేల్ జూలై 11 రాత్రి 12 గంటలు నుంచి ప్రారంభమవుతుందని సమాచారం. అమెజాన్ ప్రైమ్ డే 2025 సేల్ మూడు రోజులపాటు అంటే జూలై 14 రాత్రి 11:59 వరకు అందుబాటులో ఉంటుంది. అమెజాన్లో ఉండే అన్ని రకాల ఉత్పత్తులపై మీరు భారీ తగ్గింపులతో పాటు మరింత డిస్కౌంట్ పొందడానికి ఎస్బిఐ, ఐసిఐసిఐ బ్యాంకు కార్డులను కూడా వినియోగించవచ్చు. ఈ బ్యాంకు కార్డులతో మీరు పేమెంట్ చెల్లించినట్లయితే అదనంగా మీరు 10 శాతం తగ్గింపును పొందవచ్చు.
మీరు ఈ సెల్ పేజీలో చూసినట్లయితే ఇందులో ప్రైమ్ సభ్యుల కోసం ఏకంగా 400 కంటే ఎక్కువ కొత్త ఉత్పత్తిలో అందుబాటులో ఉన్నట్లు తెలుస్తుంది. అలాగే మొబైల్ ఫోన్లు వాటి ఉపకారణాలపై కూడా 40% వరకు డిస్కౌంట్ లభిస్తుంది. ఎలక్ట్రానిక్స్ ఉపకరణాలపై 80% వరకు అలాగే స్మార్ట్ టీవీలు మరియు ప్రొజెక్టర్ లపై 65% వరకు డిస్కౌంట్ పొందవచ్చు. హోం అప్లయెన్సెస్ పై మీరు ఈ ప్రత్యేక సేల్ లో 65% డిస్కౌంట్ పొందవచ్చు.