PM MODI: రైతులకు 4 శాతం వడ్డీకే రూ.3 లక్షల రుణం ఇస్తూ.. గుడ్ న్యూస్ చెప్పిన కేంద్ర ప్రభుత్వం..
కేంద్ర ప్రభుత్వం దేశంలో ఉన్న రైతులందరికీ ఇప్పటివరకు ఎన్నో పథకాలను అమలు చేసిన సంగతి అందరికీ తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం అందించిన ఈ పథకాల ద్వారా చాలామంది రైతులు లబ్ధి పొందుతున్నారు. రైతులు ఆర్థికంగా ఎదిగేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక స్కీమ్ లో అందుబాటులోకి తెచ్చింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ దేశంలో ఉన్న లక్షలాది మంది రైతులు కిసాన్ క్రెడిట్ కార్డు పథకాన్ని ఉపయోగించుకుంటున్నట్లు తెలిపారు. రైతులందరూ ఈ పథకం కింద తక్కువ వడ్డీ రేటుకే రుణ సౌకర్యాన్ని సకాలంలో పొందుతున్నారని తెలిపారు.
దీనికి సంబంధించిన పూర్తి వివరాలను లేదా ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. కేంద్ర ప్రభుత్వం రైతులకు అందిస్తున్న ఈ ఆర్థిక సాయం వాళ్లు విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు వంటివి వ్యవసాయ అవసరాలకు ఉపయోగపడుతుందని తెలిపారు. ప్రస్తుతం దేశంలో ఉన్న రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డు చాలా బలమైన ఆర్థిక సహాయంగా మారిందని తెలిపారు. ఈ కార్డు కోసం ఇప్పటివరకు 465 లక్షల దరఖాస్తులు ఆమోదించినట్లు కూడా చెప్పుకొచ్చారు. రూ.5.7 లక్షల కోట్లకు వీటి పరిమితి ప్రస్తుతం చేరుకున్నట్లు ఆమె వివరించారు. స్వల్ప కాలిక పంట రుణాలు వీటి ద్వారా ప్రస్తుతం చాలా సులభతరమయ్యాయి అని చెప్పొచ్చు.
కేంద్ర ప్రభుత్వం కేసీసీ ద్వారా మరియు వ్యవసాయ కార్యకలాపాలకు రైతులందరి ఆర్థిక అవసరాలను తీర్చడానికి వాళ్లకు రుణ రూపంలో ఐదు లక్షల వరకు ఆర్థిక సహాయం ఇస్తుంది. తాజాగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ దేశవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డ్ ఆర్థిక జీవనాధారంగా మారిందని పోస్టులో తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న కేసీసీ ప్రభుత్వం రైతులకు వ్యవసాయానికి సంబంధించిన వస్తువులను కొనుగోలు చేయడంలో అలాగే పంట ఉత్పత్తికి సంబంధించిన నగదు అవసరాలను తీర్చుకోవడంలో కూడా చాలా సహాయపడుతుందని తెలిపారు.