INDIA: ఖరీఫ్ లో మరిన్ని కష్టాలు ఎదుర్కోబోతున్న పాకిస్తాన్..

Sindhu Water
Sindhu Water

INDIA: ఖరీఫ్ లో మరిన్ని కష్టాలు ఎదుర్కోబోతున్న పాకిస్తాన్..

 

పహల్గాం ఉగ్రదాడి జరిగిన తర్వాత నుంచి మన దేశం పాకిస్తాన్ కు బుద్ధి చెప్పేందుకు సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేసిన సంగతి అందరికీ తెలిసిందే. సింధు జలాల ఒప్పందాన్ని మన దేశం నిలిపివేయడంతో దాయాది దేశం పాకిస్తాన్ కి నీటి కష్టాలు మొదలయ్యాయి. నీటిమట్టం అక్కడ జలాశయాలలో దారుణంగా పడిపోయింది. అక్కడ నుంచి నీటిని తీసుకోలేని పరిస్థితి పాకిస్తాన్లో ఏర్పడింది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది సింధు బేసిన్ లో 15% నీటి ప్రవాహం తగ్గినట్లు తెలుస్తుంది. వేసవి కాలంలో పంటలు ఎండిపోయి కష్టపడుతున్న రైతులకు మళ్ళీ ఖరీఫ్ సీజన్లో కూడా ఈ నీటి జలాలు నిలిచిపోవడంతో మరి నీ కష్టాలు తప్పవని నిపుణులు అంచనా వేస్తున్నారు.

గత ఏడాది జూన్ 5వ తేదీన పంజాబ్ ప్రావిన్సీలో 1.44 లక్షల క్యూసెక్కుల నీరు విడుదల అయింది. ఈ ఏడాది 1.25 లక్షల క్యూసెక్కులకు నీటి విడుదల తగ్గిపోయింది. ప్రస్తుతం గణాంకాల ప్రకారం పాకిస్తాన్ దేశంలో ఫైబర్ పక్తుంఖ తార్బేలా ఆనకట్ట దగ్గర 1465 మీటర్లకు సింధు నది నీటిమట్టం తగ్గిపోయినట్లు తెలుస్తుంది.ఈ ఆనకట్ట కనిష్ట స్థాయి నీటిమట్టం 1465 మీటర్లు. ఇక పంజాబ్లో ఉన్న చస్మా ఆనకట్ట దగ్గర కూడా ప్రస్తుతం 644 మీటర్లకు నీటిమట్టం తగ్గిపోయింది.

ఇక సియాల్కోట్ దగ్గర పరిస్థితి మరింత తీవ్రంగా ఉందని చెప్తున్నారు. మే 28వ తేదీన చినాబ్ ఆనకట్టపై సగటు నీటి విడుదల 26,645 క్యూసెక్కులు ఉంటే అది ప్రస్తుతం జూన్ 5వ తేదీన 3,064 క్యూసెక్కులకు తగ్గిపోయింది. పాకిస్తాన్లో ఉన్న పంజాబ్లో ఈసారి ఖరీఫ్ పంటలు ప్రమాదంలో పడినట్లు తెలుస్తోంది. మన దేశం తీసుకున్న నిర్ణయంతో 21 శాతం నీటిమట్టంలో కొరత ఏర్పడుతుందని పాకిస్తాన్ దేశం అంచనా వేసింది. అయితే పాకిస్తాన్ తీరు ఉగ్రవాదంపై మారేవరకు కూడా మన దేశం ఒప్పందం నిలిపివేత కొనసాగుతుందని మన దేశం ఇప్పటికే స్పష్టంగా తెలిపింది.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group Join Now