Post Office Scheme: ఈ మధ్యకాలంలో పెరుగుతున్న ఖర్చుల నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా ఆర్థిక క్రమశిక్షణను అలవాటు చేసుకుంటున్నారు. ప్రతినెల (Every Month) సంపాదించిన దాంట్లో ఎంతోకొంత పొదుపు చేస్తున్నారు. వీటికి అనుగుణంగానే ప్రభుత్వాలు కూడా అనేక రకాల పొదుపు పథకాలను ప్రజల కోసం అందుబాటులోకి తెచ్చాయి. ఈరోజుల్లో ఎంత డబ్బు సంపాదించినా కూడా అందులో ఎంత పొదుపు చేస్తున్నామన్నది చాలా కీలకంగా (Crucially) మారుతుంది. భవిష్యత్తులో ఆర్థిక భరోసా కోసం పిల్లల ఉన్నత చదువు, ఆడపిల్లల పెళ్లి కోసం తల్లిదండ్రులు సంపాదించిన కొద్ది మొత్తంలో కూడా ఎంతోకొంత పొదుపు చేసి వాటిని పథకాలలో పెట్టుబడిగా పెడుతున్నారు.
Also Read: పోస్ట్ ఆఫీస్ లో బెస్ట్ స్కీమ్.. పెట్టుబడి పెట్టండి.. ప్రతినెల ఆదాయం పొందండి
పిల్లల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు ఇప్పటినుంచే పథకాలలో చేరుతున్నారు. ఇటువంటి వారి కోసం పోస్ట్ ఆఫీస్ (Post Office) లో అనేక రకాల పథకాలు అందుబాటులో ఉన్నాయి. వాటిలో పోస్ట్ ఆఫీస్ అందిస్తున్న బాల జీవన్ భీమ పథకం కూడా ఒకటి. ఇందులో మీరు చాలా తక్కువ పొదుపుతో మంచి లాభాలు పొందవచ్చు. ప్రతిరోజు కేవలం రూ.6 రూపాయల నుంచి గరిష్టంగా రూ.18 రూపాయల వరకు ఈ పథకంలో పెట్టుబడి పెట్టవచ్చు. ఐదు నుంచి 20 ఏళ్ల మధ్య ఉన్న పిల్లలు ఈ పథకానికి (Scheme) అర్హులు. అయితే పోస్ట్ ఆఫీస్ లో సంబంధిత పిల్లల తల్లిదండ్రులు తమ పిల్లల పేరు మీద ఈ పథకాన్ని ప్రారంభించవచ్చు. అలాగే ఈ పథకానికి తల్లిదండ్రుల వయస్సు కూడా 45 ఏళ్లకు మించి ఉండకూడదు.
Also Read: పోస్ట్ ఆఫీస్ లో సూపర్ స్కీం.. రూ.333 పొదుపుతో.. రూ.17 లక్షల రిటర్న్స్
ఒక కుటుంబంలో కేవలం ఇద్దరు పిల్లల వరకు మాత్రమే ఈ పథకంలో చేరి అవకాశం ఉంది. ఒక్కొక్కరికి ప్రతిరోజు కేవలం రూ.6 రూపాయల పొదుపుతో మీరు మెచ్యూరిటీ (Maturity) సమయానికి ఒక లక్ష రూపాయలు రాబడి అందుకోవచ్చు. అలాగే మీరు రూ.18 రూపాయలు పెట్టుబడి పెట్టినట్లయితే మీరు మెచ్యూరిటీ సమయానికి మూడు లక్షల రాబడి పొందవచ్చు. ఒకవేళ మీరు ఇద్దరు పిల్లలపై ప్రతిరోజూ రూ.36 రూపాయలు పొదుపు (Investment) చేసినట్లయితే మీరు ఆరు లక్షలు మెచ్యూరిటీ సమయానికి అందుకోవచ్చు.
















