Ration Card updates | రేషన్ కార్డులపై అసెంబ్లీలో కీలక ప్రకటన..
ప్రజా శంఖారావం, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) అసెంబ్లీలో రేషన్ కార్డుల (Ration Card) పై కీలక ప్రకటన చేశారు. ఇకపై రేషన్ కార్డు లబ్ధిదారులకు నిత్యవసర సరుకులను అందజేయనున్నట్లు గొప్ప శుభవార్తను మంత్రి తెలిపారు. రేషన్ దుకాణాల్లో సన్న బియ్యంతో పాటు నిత్యవసర సరుకులు పప్పులు, ఉప్పు, నూనె వంటి వస్తువులను పంపిణీ చేస్తామని లబ్ధిదారులు వాటిని తీసుకువెళ్లాలని మంత్రి కోరారు. అసెంబ్లీ వేదికగా మంత్రి (Minister) ప్రకటన చేయడంతో రేషన్ కార్డుల లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కొత్త రేషన్ కార్డుల పంపిణీ కూడా త్వరగా పూర్తిచేస్తే బాగుంటుందని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group
Join Now