Farmer: చేగుంట, మార్చి 26 (ప్రజా శంఖారావం): వ్యవసాయ శాఖ ద్వారా మహిళా రైతులకు సబ్సిడీపై వ్యవసాయ యంత్ర పరికరాలకు దరఖాస్తులు స్వీకరిస్తున్నామని వ్యవసాయ అధికారి హరిప్రసాద్ బుధవారం ఒక ప్రకటన ద్వారా కోరారు. ఎస్సీ ఎస్టీ కులాలకు చెందిన మహిళ రైతులకు 50 శాతం ఇతర వర్గాల మహిళా రైతులకు 40 శాతం సబ్సిడీపై వ్యవసాయ యంత్ర పరికరాలను అందజేస్తామని ఆయన అన్నారు.
మెదక్ జిల్లా చేగుంట మండల కేంద్రంలోని మహిళా రైతులకు కోసం నాలుగు చేతితో నడిచే బ్యాటరీ పంపులు, 3 పవర్ స్ప్రేయర్, 1 రోటవేటర్, 1 విత్తనాలు, ఎరువులు వేసే యంత్రం, 2 డాక్టర్ తో నడిచే పరికరాలు, 1 ట్రాక్టర్ కేటాయించబడిందని కేవలం ఇది మహిళా రైతులకు వర్తిస్తుందని ఆయన వివరించారు. ఆసక్తి ఉన్న మహిళా రైతులు పట్టా పాస్ పుస్తకాలతో పాటు ఆధార్ కార్డు జిరాక్స్ లను దరఖాస్తు ఫారంతో జతచేసి స్థానిక మండల వ్యవసాయ శాఖ కార్యాలయంలో ఈనెల 28 లోపు అందజేయాలని సూచించారు.