DOLO 650 TABLET: డోలో 650 టాబ్లెట్స్ పై.. అమెరికా వైద్యుని సంచలన పోస్ట్

DOLO 650 TABLET
DOLO 650 TABLET

DOLO 650 TABLET: తాజాగా డోలో 650 గురించి ఒక అమెరికన్ వైద్యుడు ఎక్స్ లో పెట్టిన పోస్ట్ సంచలనం సృష్టిస్తుంది. అతను ఎక్స్ లో డోలో 650 గురించి ట్వీట్ చేశాడు. ఈ క్రమంలో అది ఎక్స్ లో ట్రెండింగ్ అవుతుంది. భారతీయులు డోలో 650ని చాక్లెట్ లాగా తింటారని డాక్టర్ ఎక్స్ లో ట్వీట్ చేశాడు. భారతీయులు డోలో 650 టాబ్లెట్ ని క్యాడ్బరీ చాక్లెట్ లాగా తీసుకుంటారని ఆయన ప్రస్తావించాడు.

అంటే క్యాడ్బరీ చాక్లెట్ తిన్నంత హాయిగా భారతీయులు డోలో 650ని ఉపయోగిస్తారని ఆయన చేసిన పోస్ట్ ప్రస్తుతం సంచలనం అవుతుంది. అమెరికన్ వైద్యుడు పలనియప్పన్ మాణిక్యం డోలో 650 గురించి భారతీయుల మనస్తత్వం గురించి ఎక్స్ లో పోస్ట్ చేశారు. డోలో 650 నో భారతీయులు క్యాడ్బరీ జేమ్స్ లాగా ఉపయోగిస్తారు అని డాక్టర్ పాల్ గతంలో ఎక్స్ లో రాశారు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో ప్రజల నుంచి భారీ రేంజ్ లో స్పందనలు వస్తున్నాయి.

ఈ విషయంపై చాలామంది ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఈ పోస్టుకు ఆరోగ్య సంరక్షణ నిపుణులు కూడా స్పందించారు. ప్రజలు దీనినే హాస్యాస్పదంగా తీసుకున్నారు. భారతీయ ప్రజలు సాధారణ జ్వరం మరియు తలనొప్పికి ఈ మందును తీసుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే దాని దుష్ప్రభావాల గురించి మీరు ఎప్పుడైనా ఆలోచించారా. ఇది ఒక పారాసెటమాల్. నొప్పి నివారినిగా పనిచేస్తుంది. భారతదేశంలో దీనిని అమ్ముతున్నట్లు తెలిపారు.

కాల్ పోల్, క్రోసిన్, సుమో, పారాసిపో వంటి వివిధ బ్రాండ్ల పేర్లు కూడా డోలో 650 విధంగానే ఉంటాయి. మీకు సమీపంలో ఉన్న ప్రతి భారతీయ వైద్య దుకాణాలలో ఇది అందుబాటులో ఉంటుంది. గతంలో కోవిడ్ 19 సమయం నుంచి డోలో 650 కి మార్కెట్లో డిమాండ్ బాగా పెరిగింది. ప్రజలకు తేలికపాటి జ్వరం లేదా శరీరంలో నొప్పి వచ్చినప్పుడు వేసుకుంటారు. ఇది బాగా ప్రాచుర్యం పొందిన ఔషధంగా పేరు తెచ్చుకుంది.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group Join Now