Home తాజా వార్తలు Todays Gold Rate: పరుగులు పెడుతున్న పసిడి.. ఈరోజు తులం పసిడి ఎంత అంటే..

Todays Gold Rate: పరుగులు పెడుతున్న పసిడి.. ఈరోజు తులం పసిడి ఎంత అంటే..

Todays Gold Price
Todays Gold Price

Todays Gold Rate: పరుగులు పెడుతున్న పసిడి.. ఈరోజు తులం పసిడి ఎంత అంటే..

గత కొన్ని రోజుల నుంచి స్పీడుగా పరుగులు తీస్తున్న బంగారం లక్ష రూపాయలకు చేరుకుంది. ప్రస్తుతం తులం బంగారం కొనాలంటే లక్ష రూపాయలు దగ్గర పెట్టుకోవాల్సిందే. గతంలో ఎన్నడూ లేని విధంగా పసిడి ధరలు టాప్ గేర్ లో దూసుకుపోతున్నాయి. మార్కెట్లో రోజురోజుకు బంగారం ధర పెరుగుతూనే ఉంది. గత 15 రోజులలో ఏకంగా రూ.7,130 కి చేరుకుంది. తులం పసిడి ధర ఏప్రిల్ ఏడవ తేదీన రూ.91,420 ఉంటే శనివారం రోజున ఈ ధర రూ.98,550 కు చేరుకుంది. ఈ వారంలో కూడా పసిడి ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందని బిజినెస్ అనలిస్టులు అంచనా వేస్తున్నారు. 30వ తేదీన అక్షయ తృతీయ సందర్భంగా పసిడి ధర లక్ష అవ్వచ్చని అంచనా వేస్తున్నారు. పసిడి ధరలు ఈ విధంగా పెరగడానికి ముఖ్య కారణం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్.

ఒకవైపు డోనాల్డ్ ట్రంప్ సుంకాలతో బాధిస్తూనే మరోవైపు తమ దేశంలోని సెంట్రల్ బ్యాంక్ ను కూడా టెన్షన్ లో పెడుతున్నాడు. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్ను డోనాల్డ్ ట్రంప్ భయం వీడటం లేదు. ఇప్పటికే ట్రంప్ యూఎస్ ఫెడ్ చీఫ్ పావెల్ ను తొలగిస్తానంటే హెచ్చరికలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఫెడ్ స్వతంత్రతకు భంగం వాటిల్లో వచ్చానే బిజినెస్ ఇన్వెస్టర్లు ఆందోళన పడుతున్నారు. మరోవైపు డోనాల్డ్ ట్రంప్ వడ్డీ రేట్లు తగ్గించాలని డిమాండ్ చేస్తుండగా ఆయన చేసిన ప్రతిపాదనను యూఎస్ ఫెడ్ తోసిపుచ్చుతుంది. ఈ విధంగా ట్రంప్ ప్రవర్తిస్తుండడంతో బంగారం పై పెట్టుబడికి ఇన్వెస్టర్లు ఆసక్తి చూపిస్తున్నారు.

హైదరాబాద్ నగరంలో బంగారం, వెండి ధరలు..

ఈ క్రమంలో పసిడి ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. అంతర్జాతీయ పరిణామాలలో జరుగుతున్న మార్పులతో మనదేశంలో కూడా బంగారం ధరలు అమాంతంగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో స్వచ్ఛమైన తులం బంగారం ధర రూ.98,550 గా ఉంది. అలాగే కిలో వెండి ధర హైదరాబాద్ నగరంలో రూ.98,400 గా ఉంది.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group Join Now