Todays Gold Rate: పసిడి ప్రియులకు షాక్.. మళ్లీ లక్షకు చేరువలో తులం పసిడి ధర…ఈరోజు తులం ఎంత ఉందంటే

Todays Gold Rate
Todays Gold Rate

Todays Gold Rate: మళ్లీ గత కొన్ని రోజుల నుంచి మార్కెట్లో బంగారం ధరలు పెరుగుతూ పరుగులు పెడుతున్నాయి. వెండి ధరలు కూడా రోజురోజుకు పెరుగుతున్నాయి. హైదరాబాద్ నగరంలో ఈరోజు కిలో వెండి ధర రూ.1,08,800 గా ఉంది. ప్రస్తుతం బంగారం ధరలు భారీగా పెరిగాయి. గత కొన్ని రోజుల క్రితం తులం బంగారం ధర లక్షల రూపాయలను దాటిన సంగతి తెలిసిందే. కానీ ఆ తర్వాత క్రమక్రమంగా తగ్గుతూ వచ్చిన బంగారం ధర మళ్ళీ ప్రస్తుతం లక్ష రూపాయలు దాటేందుకు రెడీ అవుతుంది.

అంతర్జాతీయ మార్కెట్లలో జరుగుతున్న పరిణామాల కారణంగా అలాగే అమెరికా చైనా మధ్య వాణిజ చర్చలు జరుగుతున్న క్రమంలో మన దేశంలో కూడా బంగారం ధరలు పెరుగుతున్నాయి అని ఆర్థిక నిపుణులు చెప్తున్నారు. మన దేశ సంప్రదాయంలో బంగారానికి ఉన్న ప్రత్యేక స్థానం గురించి అందరికీ తెలిసిందే. దేశవ్యాప్తంగా జూన్ 13, శుక్రవారం స్వచ్ఛమైన తులం బంగారం ధర రూ.99,290 గా ఉంది. వెండి ధరలు కూడా గత కొన్ని రోజుల నుంచి పెరుగుతున్నాయి.

మన దేశంలో ఉన్న పలు ప్రధాన నగరాలు ముంబై, కోల్కత్తా, చెన్నై,హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, రాజమండ్రి, వరంగల్ మరియు ప్రొద్దుటూరు వంటి నగరాలలో ఈరోజు స్వచ్ఛమైన 10 గ్రాముల పసిడి ధర రూ.99,290, 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర ఈరోజు రూ.91,010 గా ఉన్నాయి. ఇక మన దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్లో మాత్రం ఈరోజు స్వచ్ఛమైన తులం పసిడి ధర రూ.99,440, 22 క్యారెట్ల దూరం పసిడి ధర రూ.91,160 గా ఉంది. దేశంలో ఉన్న అన్ని ముఖ్యమైన నగరాలలో కూడా ఈరోజు కిలో వెండి ధర రూ.1,08,800 గా ఉంది. ఇక ప్రాంతాలను బట్టి బంగారం మరియు వెండి ధరలలో కొంచెం వ్యత్యాసం ఉంటుంది అన్న సంగతి మీరు గమనించగలరు.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group Join Now