Siddhartha College: సీనియర్లకు జూనియర్ విద్యార్థుల వీడ్కోలు
ఆర్మూర్, ఏప్రిల్ 24 (ప్రజా శంఖారావం): ఎక్కడో పుట్టి ఇక్కడే కలిసాము.. చదువుల తల్లి ఒడిలో.. అంటూ ప్రేమను రాగాలతో సీనియర్ విద్యార్థులకు జూనియర్ విద్యార్థులు ఆప్యాయంగా వీడ్కోలు పలికారు. గురువారం నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణ కేంద్రంలోని సిద్ధార్థ డిగ్రీ కళాశాలలో సీనియర్ విద్యార్థులకు వీడ్కోలు చెప్పడానికి జూనియర్ విద్యార్థులు అట్టహాసంగా వీడ్కోలు సమావేశ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమం సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలను విద్యార్థులు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాల్లో సీనియర్ జూనియర్ తేడా లేకుండా అందరూ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సీనియర్ విద్యార్థులు జూనియర్ విద్యార్థులకు చదువుల పట్ల శ్రద్ధ చూపాలనీ, పాఠాలు బోధించే గురువుల పట్ల ప్రేమ పూర్వకంగా ఉండాలని కోరుతూ భవిష్యత్తులో గొప్ప స్థానాన్ని పొందాలని ఆకాంక్షించారు. కార్యక్రమాల అనంతరం సిద్ధార్థ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ నవీన్ యాదవ్, వైస్ ప్రిన్సిపాల్ రాకేష్ లు మాట్లాడారు. చదువుతోపాటు స్కిల్ డెవలప్మెంట్ అవసరమని, టెక్నికల్ కోర్సుల పట్ల విద్యార్థులు దృష్టి సారించి భవిష్యత్తులో గొప్ప స్థాయిలో ఉండాలని సూచించారు.
మొన్న వెలువడినటువంటి యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ లో గ్రామీణ స్థాయి నుండి వచ్చిన పేదరికానికి చెందిన విద్యార్థులే మొదటి 60 స్థానాల్లో ఉండడం గొప్ప విషయమని, గ్రామీణ స్థాయి విద్యార్థులు తమ సత్తాచాటాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ ఆధ్యాపక బృందం రాకేష్ గౌడ్, అర్చన, శ్రీధర్ బట్టు, రజనీకాంత్, అరవింద్, ప్రమోద్, నిఖిత, తదితరులు పాల్గొన్నారు.