Armoor: ఆర్మూర్, జూలై 02 (ప్రజా శంఖారావం): స్టార్స్ ఆఫ్ ఇండియా వీకనెక్ట్ ఫ్లిమ్స్ అండ్ ఎంటర్టైన్మెంట్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఇంటర్నేషనల్ గ్లోరీ అవార్డు 2025 ను నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణానికి చెందిన స్మైల్స్ దా స్కూల్స్ సొంతం చేసుకున్నట్లు స్కూల్ మేనేజింగ్ డైరెక్టర్ రఫీ గోహార్ బుధవారం పత్రిక ప్రకటన ద్వారా తెలిపారు. ఈ సందర్భంగా ముంబై లోని హోటల్ నోవాటెల్ లో జరిగిన కార్యక్రమంలో టాలీవుడ్, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా చేతుల మీదుగా ఈ అవార్డును ఆయన అందుకున్నట్లు చెప్పారు.
ఈ సంస్థ టీవీ, ఫిలిం ఆర్టిస్టులు, వివిధ కార్పొరేట్ రంగాలకు సంబంధించిన విద్యాసంస్థలతో పాటు రియల్ ఎస్టేట్, బిజినెస్ రంగాల వారికి కూడా ఈ సందర్భంగా అవార్డులను అందజేసినట్లు ఆయన తెలిపారు. విద్యాసంస్థల రంగంలో మోస్ట్ ఇన్నోవేటివ్ స్కూల్ గా స్మైల్స్ దా స్కూల్ ఎంపిక అవ్వడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. సంవత్సరం పాటు తమ స్కూల్ పిల్లలతో చేసిన యాక్టివిటీస్, సెలబ్రేషన్స్, అకాడమిక్ పర్ఫార్మెన్స్ ను చూసి జ్యూరీ ఈ అవార్డుకు తమ స్మైల్స్ దా స్కూల్ ను సెలెక్ట్ చేయడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. తమ స్కూల్ యాజమాన్యంతో పాటు సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రులకు ఈ అవార్డును డెడికేట్ చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.