Astro Tips for Cow: మన దేశ సంస్కృతిలో ఆవును చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. హిందూ మత శాస్త్రంలో ఆవుని గోమాతగా కూడా పూజిస్తారు. ఆవుకు ఆహారం అందించడం వలన చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఇలా చేయడం ఒక సాంప్రదాయం మాత్రమే కాదు దాని వెనుక చాలా లోతైన మత, ఆధ్యాత్మిక మరియు శాస్త్రీయ కారణాలు కూడా చాలా ఉన్నాయి. పురాతన కాలంలో ఆవుకు ఆహారం అందించడం ఎంతో ప్రభావవంతంగా ఉండేది.
ఈ రోజుల్లో కూడా అంతే ప్రభావవంతంగా ఉందని చెప్పొచ్చు. హిందూ మతం ప్రకారం ఆవులో ముక్కోటి దేవతలు నివసిస్తారని చాలామంది నమ్ముతారు. ఈ క్రమంలోనే ఆవుకి ఆహారం అందిస్తే సకల దేవలకు ఆహారం అందించినట్లే అంటూ భావిస్తారు. ఇలా అవకాహారం పెట్టడం వలన ముక్కోటి దేవతల ఆశీర్వాదాలు పొందినట్టు అవుతుంది. శాస్త్రాలలో ఆవుకి ఆహారం అందించిన వ్యక్తికి దేవుడి ఆశీర్వాదం ఉంటుందని చెప్పబడింది. బెల్లం ఆవుకు అందించడం అంటే దానధర్మాలు చేసినంత పుణ్యప్రదంగా చెప్పబడింది. ఆవుకు ఆహారం అందించడం వలన జాతకంలో ఉన్న దోషాలు తొలగిపోయి వారి జీవితంలో అదృష్టం, ఆనందం కలుగుతాయి. శ్రీకృష్ణుడికి ఆవులు అంటే చాలా ఇష్టం.
ఈ విధంగా చేయడం వలన కన్నయ్య ఆశీర్వాదాలు కూడా పొందవచ్చు. కన్నయ్య బాల్యం మొత్తం ఆవులతో గడిచిన సంగతి అందరికీ తెలిసిందే. ఆవులకు సేవ చేసే వ్యక్తులకు శ్రీకృష్ణుడి ఆశీర్వాదం తప్పకుండా ఉంటుంది. ఇవి మీకు అదృష్టాన్ని కలిగిస్తాయి. మీ జీవితంలో సానుకూల శక్తి కలుగుతుంది. ఆవులకు ఆహారం పెట్టడం వలన లక్ష్మీదేవి కూడా సంతోషిస్తుంది అంటూ శాస్త్రంలో చెప్పబడింది. ఇంట్లో మొదటి ఆహారాన్ని ఆవుకి పెట్టినప్పుడు అది చాలా శుభసంకేతంగా చెబుతారు. ఈ విధంగా చేయడం వలన లక్ష్మీదేవి వాళ్ళ ఇంట్లోనే ఉంటుంది. ఆర్థిక సమస్యలు అన్ని తొలగిపోతాయి. ఈ విధంగా ఆవుకు ఆహారం పెట్టడం, సేవ చేయడం వంటివి చేయడం వలన జీవితంలో ఎప్పటికీ ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సిన పని ఉండదు.