Business ideas: రూ.10 వేల కంటే తక్కువ పెట్టుబడి.. ఇంట్లో నుంచి చేసే ఈ 5 వ్యాపారాలు.. లక్షల్లో ఆదాయం

Business ideas
Business ideas

Business ideas: ఈ మధ్యకాలంలో చాలామంది కూడా వ్యాపారం చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. వాళ్లు ఇంట్లోనే ఉంటూ తక్కువ పెట్టుబడి తో వ్యాపారం చేస్తూ లక్షల్లో ఆదాయాన్ని పొందుతున్నారు. ప్రస్తుతం మనం చెప్పుకోబోయే వ్యాపారాలకు పదివేల కంటే తక్కువ ఖర్చు అవుతుంది. కానీ ఈ వ్యాపారాలలో లాభాలు మాత్రం బాగా ఉంటాయి. ఇటువంటి వ్యాపారాలలో టిఫిన్ సర్వీస్ వ్యాపారం కూడా ఒకటి. మహిళలకు ఇది చాలా అద్భుతమైన వ్యాపారం. పెద్ద పెద్ద నగరాలలో అలాగే చిన్న చిన్న పట్టణాలలో కూడా ప్రతిరోజు ఉద్యోగం కోసం లేదా చదువు కోసం ఒంటరిగా ఉంటున్న వాళ్ళు చాలామంది ఉంటారు. అటువంటివారు ఇంటి ఆహారాన్ని కావాలనుకుంటారు. ఇటువంటి వారి కోసం ఇంట్లోనే చాలా తక్కువ పెట్టుబడితో టిఫిన్ సర్వీస్ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. దీనిలో లాభాలు చాలా ఎక్కువగా ఉంటాయి.

ఇంట్లో నుంచి చాలా తక్కువ పెట్టుబడి తో చేసే వ్యాపారం ఆవకాయ వ్యాపారం. చాలామంది ప్రతిరోజూ భోజనంలో ఆవకాయ కోరుకుంటారు. కాబట్టి మీరు ఇంట్లో నుండి ముడి సరుకుతో, సరైన రెసిపీతో ఈ వ్యాపారాన్ని పదివేల కంటే తక్కువ పెట్టుబడితో పెట్టవచ్చు. బాగా రుచి ఉన్న ఆవకాయకు మార్కెట్లో చాలా డిమాండ్ ఉంది. అలాగే ఈరోజుల్లో తక్కువ పెట్టుబడి తో మంచి లాభాలు పొందే వ్యాపారాలలో టీవీ వ్యాపారం కూడా ఒకటి. ప్రతిరోజు పెద్ద సంఖ్యలో ప్రజలు టీ తాగుతూ ఉంటారు. ఇలా కొంతమంది చిన్నచిన్న టీవీ వ్యాపారం మొదలుపెట్టి లక్షల్లో సంపాదిస్తున్నారు.

కేవలం ₹ 10వేల కంటే తక్కువ ఖర్చుతో ఈ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. పెళ్లిళ్లలో అలాగే శుభకార్యాలలో మహిళలు మెహిందీ వేయించుకుంటారు. నగరాలలో మెహేంది స్టూడియోలు ప్రతిచోట కనిపిస్తాయి. కానీ గ్రామాలలో మాత్రం మెహిందీ వేసే వ్యక్తులు చాలా తక్కువ మంది ఉంటారు. అలా మెహందీ సేవలు అందుబాటు లేని ప్రాంతంలో మీరు వీకెండ్లలో లేదా సాయంత్రం సమయాలలో మెహందీ వేసి మంచి ఆదాయం పొందవచ్చు. దీనికి కూడా 10,000 కంటే తక్కువ పెట్టుబడి అవసరమవుతుంది. ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా ఆన్లైన్ సేవలే కనిపిస్తున్నాయి. అయితే గ్రామీణ ప్రాంత ప్రజలు ఆన్లైన్ సేవలను పొందడానికి నగరాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. ఈ క్రమంలో మీరు ఆ ప్రాంతంలో చిన్న కంప్యూటర్ ప్రింటర్ తో ఆన్లైన్ సేవా కేంద్రాన్ని ప్రారంభించి మంచి ఆదాయం పొందవచ్చు. దీనికి కూడా 10,000 కంటే తక్కువ పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group Join Now