Coconut vs Sugarcane: ఈ మే నెలలో వేసవి కాలం కావడంతో ఎండలు బాగా మండిపోతున్నాయి. సూర్యుడు భగభగ మండుతున్నాడు. ఉదయం 10 గంటల నుంచి ఎండలు బాగా తీవ్రంగా ఉంటున్నాయి. వీటితో పాటు వడగాల్పులు కూడా వేస్తున్నాయి. ఎండలో ఎక్కువగా తిరగడం వలన డిహైడ్రేషన్ అయ్యే ప్రమాదం ఉంది. ఇటువంటి సమయంలో బయటకు వెళ్లినప్పుడు చల్లని పానీయాలను చాలామంది తాగుతూ ఉంటారు. అయితే ఈ వేసవి కాలంలో ఎక్కువగా కొబ్బరి బొండాలు అలాగే చెరుకు రసం తాగుతూ ఉంటారు. ఈ రెండు పానీయాల వలన ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
ఎండాకాలంలో ప్రజలు ఎక్కువగా తాగే పానీయాలు కొబ్బరినీరు, చెరుకు రసం. ఈ రెండిటి వలన ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉంటాయి. చెరుకు రసం శరీరానికి తక్షణ శక్తిని అందిస్తుంది. శరీరంలో ఉండే హానికరమైన విషయాన్ని ఇది బయటకు పోయేలా చేస్తుంది. కాలేయం ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఈ వేసవి కాలంలో చెరుకు రసం శరీరానికి చల్లదనాన్ని ఇస్తుంది. ఈ ఎండాకాలంలో చెరుకు రసం తాగడం వలన హీట్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం తగ్గుతుంది. ఇది శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచడంలో చాలా సహాయం చేస్తుంది.
వేసవికాలంలో శరీరానికి కొబ్బరి నీళ్లు కూడా చాలా ప్రయోజనాన్ని కలిగిస్తాయి. కొబ్బరి నీళ్లు తాగడం వలన శరీరం డిహైడ్రేషన్ అవ్వదు. కొబ్బరినీళ్లు శరీరంలో జీవ క్రియను పెంచుతాయి. ఉదయం ఖాళీ కడుపుతో కొబ్బరి నీళ్లు తాగడం వలన బరువును తగ్గించుకోవచ్చు. కొబ్బరినీళ్లు తాగడం వలన బీపీ కూడా కంట్రోల్ లో ఉంటుంది. అయితే ఈ ఎండాకాలంలో కొబ్బరి నీళ్లు, చెరుకు రసం దేనికదే ప్రత్యేక ప్రయోజనాలను కలిగి ఉన్నాయి. ఒకవేళ మీరు ఈ ఎండాకాలంలో తక్షణ శక్తి పొందాలి అనుకుంటే చెరుకు రసం తీసుకోవచ్చు. అలాగే డీహైడ్రేషన్ కాకుండా ఉండాలి అంటే కొబ్బరి నీళ్లు తాగవచ్చు. కొబ్బరి నీళ్లు తాగడం వలన షుగర్ కూడా నియంత్రణలో ఉంటుంది.