Cibil Score: ఒక వ్యక్తి బ్యాంకులో లోన్ పొందాలంటే అతని సిబిల్ స్కోర్ చాలా అవసరం. మామూలుగా అయితే సిబిల్ స్కోర్ 30 నుంచి 900 పాయింట్లు మధ్యలో ఉంటుంది అన్న సంగతి తెలిసిందే. ఈ సివిల్ స్కోర్ 750 పాయింట్లు నుంచి 900 పాయింట్లు మధ్యలో ఉంటే మీకు రుణం పొందే అర్హత భారీగా ఉంటుంది. ఒకవేళ సిబిల్ స్కోర్ 600 పాయింట్లు నుంచి 750 పాయింట్లు మధ్యలో ఉంటే ఋణం తీసుకునే అర్హత మీకు తగ్గుతుంది అని చెప్పొచ్చు. ఒకవేళ మీ సివిల్ స్కోర్ 600 పాయింట్లు కన్నా కూడా తక్కువగా ఉన్నట్లయితే మీరు బ్యాంకు నుంచి రుణం పొందడం అసాధ్యమని చెప్పొచ్చు. కానీ తక్కువ సిబిల్ స్కోర్ ఉన్నప్పటికీ కూడా అధిక వడ్డీ రేట్లు కొన్ని బ్యాంకులు రుణాలను ఇస్తున్నాయి.
ఒకవేళ మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉన్నా కూడా మీరు బ్యాంకు నుంచి రుణం పొందాలి అనుకున్నట్లయితే మీరు గోల్డ్ లోన్ తీసుకోవడం చాలా బెటర్. ఎలాంటి సిబిల్ స్కోర్ అవసరం లేకుండా మీరు గోల్డ్ లోన్ తీసుకోవచ్చు. ఆ రోజు ఉన్న రేటును బట్టి మీకు గోల్డ్ పై రుణం పొందొచ్చు. బ్యాంకింగ్ సంస్థలతోపాటు నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు కూడా మీకు గోల్డ్ లోన్ ఇస్తాయి. అలాగే ఒకవేళ మీ సిబిల్ స్కోర్ చాలా తక్కువగా ఉంది మీరు బ్యాంకు నుంచి రుణం పొందాలి అనుకుంటున్నాట్లయితే మీ ఇల్లు లేదా ఆస్తులు వంటివి బ్యాంకులో తనక పెట్టి లోన్ పొందవచ్చు.
ఈ లోన్ పొందాలంటే కూడా ఎలాంటి సిబిల్ స్కోర్ అవసరం ఉండదు. అలాగే బ్యాంకులో మీరు దాచుకున్న ఫిక్స్డ్ డిపాజిట్ లను తనక పెట్టి కూడా మీరు లోన్ తీసుకునే అవకాశం ఉంది. దీనికి కూడా ఎటువంటి సిబిల్ స్కోర్ అవసరం ఉండదు. అలాగే సిబిల్ స్కోర్ అవసరం లేకుండా లోన్ పొందాలి అనుకుంటే ఎల్ఐసి పాలసీలపై కూడా లోన్ తీసుకోవచ్చు. సిబిల్ స్కోర్ ఎక్కువగా ఉన్న కో అప్లికేట్ ద్వారా మీరు బ్యాంకులో రుణానికి అప్లై చేసుకుంటే మీకు లోన్ వచ్చే అవకాశం ఉంటుంది.